స్పందించిన ఆర్‌బీఐ
రుణ యాప్‌లపై నమోదైన కేసుల అంశంపై ఆర్‌బీఐ స్పందించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
గడువు కోరిన సీబీఐ
ఓబుళాపురం గనుల అక్రమాల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 29కి వాయిదా వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇన్ని సంక్షేమ పథకాలున్నాయా..?
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దేశంలో రైతుల క్షేమం గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆరే అంటూ కొనియాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
బీసీలకే ఇవ్వాలి
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం బీసీలకు ఇవ్వాలని కోరుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఎక్కువ జనాభా కలిగిన బీసీలు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
గరం గరం
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వైకాపా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. పరస్పర అవినీతి ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఇరువురు నేతలు గుడిలో సత్య ప్రమాణాలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.