తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@5PM - top ten news for 5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@5PM

By

Published : Dec 20, 2020, 4:59 PM IST

గల్లంతు

ఖమ్మం జిల్లా పులిగుండాల ప్రాజెక్టులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టులోకి ఈతకు వెళ్లి మునిగిపోయారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మరణం ముందు ఓడిన ప్రేమ

రెండు మనసులను ఏకం చేసిన ప్రేమ.. రెండు కుటుంబాలను కలపలేకపోతోంది. చావడానికి ధైర్యం ఇస్తోంది కానీ... పెద్దల్ని ఒప్పించే శక్తినివ్వలేకపోతోంది. కుల, మతాలకతీతంగా ఆదరించే ప్రేమ.. ప్రేమికులకు జీవితంపై భరోసానివ్వలేకపోతోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అబ్బురపరిచిన విద్యార్థులు

సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా యురేకా 2020 పేరుతో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అంధుడే కానీ...

ఎటువంటి వైకల్యం ఉన్నా జీవితంలో స్వతహాగా నెట్టుకురావొచ్చేమో కానీ... చూపు లేకుంటే ఇతరులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. లోపం పెట్టిన భగవంతుడే దాన్ని జయించటానికి ఏదోక నైపుణ్యాన్ని వారిలో జనింపజేస్తాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మార్పు కోరుకుంటున్నారు

బంగాల్​ పర్యటనలో భాగంగా రెండోరోజు బిర్భమ్​ జిల్లాలోని బోల్​పుర్​లో భారీ రోడ్​ షో నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. డాక్‌బంగ్లో మైదానం నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు రోడ్​ షో ప్రారంభమైంది. బోల్​పుర్​ చౌరస్తా వరకు వెళ్లిన తర్వాత ముగించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మరో 6 నెలలు

కొవిడ్​-19 నుంచి రక్షణ పొందేందుకు మరో ఆరు నెలల పాటు మాస్క్​లు తప్పనిసరిగా వాడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే స్పష్టంచేశారు. మాస్క్​ల వినియోగాన్ని అలవాటుగా మార్చుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అతిపెద్ద జూ

ప్రపంచంలోనే అతి పెద్ద జంతు ప్రదర్శనశాల గుజరాత్​లో కొలువు తీరనుంది. ఇందుకుగాను ఆ రాష్ట్రంలోని జామ్​నగర్​లో సుమారు 250 ఎకరాలను కేటాయించినట్లు కేంద్ర జంతు ప్రదర్శనాలల ప్రాధికార సంస్థ వెల్లడించింది.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బాంబు దాడి

కారు బాంబు పేలుడులో 8 మంది మృతిచెందిన ఘటన అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​లో జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సిరీస్​ కివీస్​దే

ఆదివారం పాకిస్థాన్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో న్యూజిలాండ్ అద్భుత విజయం సొంతం చేసుకుంది. మహ్మద్ హఫీజ్​ ఒంటరి పోరాటం వృథాగా మిగిలింది. దీంతో మరో టీ20 మిగిలుండగానే సిరీస్​ను చేజిక్కించుకుంది కివీస్. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

హీరోయిన్ పాత్రలు వదులుకున్నా

సెలబ్రిటీ టాక్ షో ఆలీతో సరదాగాలో ఈ వారం సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, వై.విజయ పాల్గొని సందడి చేశారు. పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details