జలజగడం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు మూడో రోజు కొనసాగుతోంది. సాగర్ జలాశయం ప్రధాన ద్వారం వద్ద, విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికు వెళ్లే దారిలో పోలీసులు బలగాలు మోహరించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రూట్ మార్చి
రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని పీసీసీగా ప్రకటిస్తే పార్టీ రెండుగా చీలిపోతుందన్నారు కొందరు సీనియర్ నేతలు. కాంగ్రెస్లో సునామీ తప్పదనీ అన్నారు. నేతలంతా ఇతర పార్టీ బాట పట్టడం ఖాయమనే ప్రచారమూ జరిగింది. కానీ అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ.. చాణక్యనీతితో వ్యతిరేక వర్గ అంచనాలను రేవంత్ రెడ్డి తలకిందులు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇంకో పెళ్లి చేసుకుంటా..!
లావుగా ఉన్నావు.. అందంగా లేవు.. వేరొక పెళ్లి చేసుకుంటానని భర్త.. అతడికి మద్దతుగా అత్తామామలు.. వీరి వేధింపులు తాళలేక ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
సరికొత్త ఆవిష్కరణ
జన్మదిన వేడుక రోజున తన స్నేహితులతో జరిగిన చిన్న సంభాషణ ఆ బాలుడిలో ఓ ఆలోచన రేకెత్తించింది. ఐడియా వచ్చిందే తడవుగా.. దాన్ని అమలు చేసేలా చేసింది. ఆ చిన్న సంఘటన ఓ సరికొత్త ఆవిష్కరణకు తెరతీసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
భారీ శబ్దం
కర్ణాటక బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారీ శబ్దాలు వినిపించాయి. భారీ శబ్దంతో భయాందోళనకు గురైన బెంగళూరు వాసులు పరుగులు తీశారు. శబ్దం ధాటికి పలు నివాసాల్లో కిటికీలు కొట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. శబ్దానికి కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.