1.యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా కాలంలో చాలా రోజుల తర్వాత ఆలయంలో సందడి నెలకొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2.ప్రజలు చూస్తూ ఊరుకోరు
కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు బిల్లులు ప్రవేశపెడితే... ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 20 లక్షల కోట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3.మరో ఘనతను సాధించిన శంషాబాద్ విమానాశ్రయం
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏసీఐ ఎయిర్‌పోర్ట్ హెల్త్ అక్రెడిటేషన్ లభించింది. ఐసీఏఓ కౌన్సిల్ ఏవియేషన్ రికవరీ టాస్క్ ఫోర్స్ (సీఏఆర్టీ) ప్రతిపాదనలకు అనుగుణంగా ఆరోగ్యపరమైన చర్యలు తీసుకున్నందుకు ఈ గుర్తింపు వచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.న్యాయం కోసం
రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు మేనేజర్లు మృతి చెందిన ఘటన... సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం నందికందిలో చోటుచేసుకుంది. న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబసభ్యులు ధర్నా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5.ఎస్పారెస్పీకి భారీ వరద ..
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి పై నుంచి వరద కొనసాగుతోంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.