మార్పే లక్ష్యం
పురపాలక శాఖలో ఖాళీల భర్తీపై ఆ శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఆ వ్యర్థాలను ఏం చేస్తారంటే..
సచివాలయ భవనాల కూల్చివేతతో దాదాపు లక్ష టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమవుతాయని, వాటి నిర్వహణ కోసం నిబంధనలకు లోబడి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పోరాటమే శరణ్యం
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోరాటం చేస్తే ప్రభుత్వం అణిచివేస్తుందని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్, ప్రభుత్వ వైఫల్యాలపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నివాసంలో అఖిలపక్షం నేతలు చర్చలు జరిపారు. . పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కరోనా విజృంభణ
ఏపీలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్తగా 1916 కేసులు నమోదు కాగా... 43 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 408 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10 లక్షలకు పైగా కేసులట!
ఈ వారం ముగిసే సరికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటుతుందని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ సారథి చేసిన హెచ్చరికలను ట్వీట్‌కు జత చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.