ఏజెంట్ల ఆందోళన
నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో వివిధ పార్టీల ఏజెంట్లు ఆందోళనకు దిగారు. 8 బ్యాలెట్ బాక్సులకు సీల్ లేదని.. వాటిని లెక్కింపునకు తెచ్చారని ఆరోపించారు.
పంథా మార్చుకోవాలి
మూడో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ధన్యవాద తీర్మానం ప్రతిపాదించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రైతు సమస్యలపై చర్చిద్దాం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. రైతు ఆందోళనలపై సభలో చర్చిద్దామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
సంతాపం
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు శాసనమండలి సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే సభ్యులు లేచి నిలబడి మౌనం పాటించారు. అనంతరం నోముల చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రూ.3000 కోట్ల విరాళాలు
అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.3000 కోట్ల విరాళాలు వచ్చాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈమేరకు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
80 దుకాణాలు దగ్ధం
ముంబయి మలాద్ ఈస్ట్‌లోని ఓ కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు గంటలపాటు అగ్నికీలలు ఎగసిపడడం వల్ల సమీపంలోని 80 దుకాణాలు దగ్ధమయ్యాయి.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇకపై మరణ శిక్షలు!
మయన్మార్‌లో నిరసనకారులపై సైన్యం కఠిన శిక్షలు విధించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తే మరణ శిక్షలు విధిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఒడుదొడుకులు
అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 100 పాయింట్లు కోల్పోయి 50,250 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 14,870 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
గంభీర్ అసహనం
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్ రెండో మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు టీమ్ఇండియా యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్. ఈ మ్యాచ్‌లో ఇతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కీలకపాత్రలో జగపతిబాబు
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'అన్నాత్తే'. ఇందులో ఓ కీలకపాత్ర కోసం నటుడు జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.