జైలుకు అఖిల అభిమానులు
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ మహిళా జైలు నుంచి కాసేపట్లో విడుదల కానున్నారు. ఆమెకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇంకెప్పుడు?
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక.. కాంగ్రెస్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు రోజులపాటు పార్టీ సీనియర్లతో సమీక్షించిన ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్.. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమిటీకి అప్పగించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
శ్రీసుధ ఫిర్యాదు
శ్యామ్ కె.నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మిత్రులతో తనకు ప్రాణహాని ఉందంటూ సినీ నటి శ్రీసుధ ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు కలిసున్న తరువాత శ్యామ్ కె.నాయుడు తనను మోసం చేశాడంటూ గత ఏడాది మే 26న శ్రీసుధ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పోరుబాట
పోడుదారులపై అటవీశాఖ దాడులు ఆపాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత మధు డిమాండ్ చేశారు. భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పట్టాల పంపిణీ
అసోంలో భూమి పట్టాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేశారు. శివసాగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక లబ్ధిదారులకు ఆయన ఈ పట్టాలను అందజేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.