తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్ @9AM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news @ 9am
టాప్‌ టెన్ న్యూస్ @ 9 AM

By

Published : May 24, 2021, 8:58 AM IST

1. 'యాస్​' హెచ్చరికలతో రైళ్లు రద్దు

రాకాసి తుపాను కారణంగా.. తూర్పు రైల్వేలో పలు రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో.. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తూర్పు రైల్వే శాఖ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. చిన్నారులకు ఎంఐఎస్‌ ముప్పు!

కొవిడ్​ నుంచి కోలుకున్న చిన్నారుల్లో ఎంఐఎస్‌ (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌) లక్షణాలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. నవజాత శిశువుల్లోనూ ఎంఐఎస్​ లక్షణాలు కన్పించడం ఆందోళన కలిగిస్తోంది. జూన్​ తర్వాత ఇలాంటి కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని గాంధీ, నిలోఫర్ వైద్యులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. యాంటీబయాటిక్సే కారణం!

యాంటీబయాటిక్స్​ను అధికంగా వినియోగించిన వారు.. బ్లాక్​ ఫంగస్​ బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇంతకుముందు.. ఈ సమస్య తలెత్తడానికి కారణం స్టెరాయిడ్స్​ను విచక్షణారహితంగా వినియోగించడమేనని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. వ్యాక్సిన్ వద్దని పరార్​!

కొవిడ్​ టీకా వేసేందుకు ఆ గ్రామానికి చేరుకున్నారు ఆరోగ్య సిబ్బంది. కానీ, వారిని చూడగానే.. భయపడిన గ్రామస్థులు నదిలో దూకి పరారయ్యారు. వ్యాక్సిన్​పై ప్రజలకు ఇంకా ​అపోహలు వీడలేదనడానికి సాక్ష్యంగా నిలిచిన ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అక్కడ ప్రతి ఇంట్లోనూ జ్వరపీడితులు

చుట్టూ గుట్టలు.. చెట్లూపుట్టలూ.. దట్టమైన అడవులకు నెలవులు.. జీవ వైవిధ్యానికి నిలయాలు.. బాహ్య ప్రపంచానికి దూరంగా నివాసాలు.. అలాంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ బతుకులను ఆగం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ప్రాజెక్ట్‌ మదద్‌..

కరోనా రెండో దశ భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య అదే రీతిలో నమోదవుతోంది. దీనికి తోడు కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల సంఖ్య తగ్గడం ఇంకా ఆందోళనను కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి న్యూయార్క్‌లో నివసించే ప్రవాస వైద్యులు 'ప్రాజెక్ట్‌ మదద్‌' పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఆపదలో తోడుంటారు..

కరోనా కష్టంలో మేము మీవెంటే... అంటూ అండగా నిలుస్తున్నారు పోలీసులు. ఓ వైపు లాక్‌డౌన్‌ అమలులో తీరికలేకుండా ఉన్నా సేవలోనూ వారు ముందంజలో ఉన్నారు. వైద్యం అందడం గగనంగా మారిన స్థితిలో పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న పలు కేంద్రాలు బాధితులకు భరోసా ఇస్తున్నాయి. ఆహారం నుంచి అంబులెన్సుల దాకా వారు అందిస్తున్న సేవలు శెభాష్‌ అనిపించుకుంటున్నాయి. మహానగర పరిధిలోని సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అందిస్తున్న సేవల వివరాలు ఇవీ... పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. 'అణుకేంద్రాల ఫొటోలు ఇవ్వం'

2015 అణు ఒప్పందం పునరుద్ధరణకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇరాన్​ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీదారులకు ఎలాంటి ఫొటోలు, సమాచారం ఇవ్వమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. భారత బాక్సర్ల తుది సమరం

ఒలింపిక్స్​కు ముందు బాక్సర్లు తమను తాము పరీక్షించుకునేందుకు ఉన్న ఏకైక వేదిక ఏషియన్​ ఛాంపియన్​షిప్స్. భారత్​లో జరగాల్సిన ఈ పోటీలు కొవిడ్ కారణంగా దుబాయ్​కు తరలిపోయాయి. గత సీజన్లలో ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత బృందం ఈ సారి కూడా మెరుగ్గా రాణించాలని కోరుకుంటోంది. ఈ పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. సోనూసూద్​ కన్నీటి పర్యంతం

గతేడాది లాక్​డౌన్​లో ఎంతోమంది వలస కార్మికులకు సాయం చేసి మంచి మనసు చాటుకున్న నటుడు సోనూసూద్.. ఇప్పటికీ తన సేవల్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణవాయువు కొరతతో ఇబ్బంది పడుతున్న బాధితుల కోసం ఆక్సిజన్​ను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా దీని గురించి మాట్లాడిన ఆయన.. కరోనా పరిస్థితులు, తమ తల్లిదండ్రులను గుర్తుకుతెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. ​ఒక‌వేళ వాళ్లు బ‌తికుండి బెడ్లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కోసం పోరాడుతుంటే చూసి త‌ట్టుకునేవాణ్ని కాదంటూ ఉద్వేగానికి లోనయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

ABOUT THE AUTHOR

...view details