తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 9AM
టాప్​టెన్​ న్యూస్​@9AM

By

Published : Sep 15, 2020, 9:02 AM IST

1. రాష్ట్రంలో తాజాగా 2058 మందికి కరోనా

రాష్ట్రంలో కొత్తగా 2,058 మందికి కరోనా వైరస్​ సోకిగా సోమవారం 10 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 1,60,571కు చేరింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

2. 'కరోనాకు ఆరోగ్యశ్రీ చికిత్స'పై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు

కొవిడ్​ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించడంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టిసారించింది. ముఖ్యంగా చికిత్సకు ఎంత ధర నిర్ణయించాలనేది కీలకం కావడంతో ఆ దిశగా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

3. భాగ్యనగరానికి బుల్లెట్‌ రైలు!

భాగ్యనగర కీర్తి శిఖలో త్వరలో మరో కలికితురాయి చేరే అవకాశం ఉంది! దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ బుల్లెట్‌ రైలు పరుగులు పెట్టవచ్చు! ఈ మేరకు సమగ్ర నివేదిక సిద్దం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)ను కేంద్రం ఆదేశించింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

4. నెలాఖరు నుంచి టీఎస్-బీపాస్ అమలు..

రాష్ట్రవ్యప్తంగా ఇకపై ఇంటి నిర్మాణ అనుమతుల్లో వేగంతో పాటు, పారదర్శకమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన టీఎస్-బీపాస్​ బిల్లు ఆమోదం పొందింది. నెలాఖరు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

5. తాను వాడే మాస్కులపై కేటీఆర్ ట్వీట్..

తాను వాడే మాస్కులపై ట్వీట్ చేశారు చేనేత శాఖ మంత్రి కేటీఆర్. పోచంపల్లి ఇక్కత్, కలంకారి సహా చేనేత మాస్కులను తెలంగాణ చేనేత సహకార సంస్థ నుంచి ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

6. పాపికొండల్లో బోటు ప్రమాదం జరిగి ఏడాది..

పాపికొండల అందాల్ని వీక్షించడానికి ఔత్సాహికులతో బయలుదేరిన బోటు 2019, సెప్టెంబరు 15న ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద మునిగిపోయింది. ఈ ఘటనలో 51 మంది జలసమాధి కాగా... 26 మందిని స్థానికులు రక్షించారు. ఈ విషాద ఘటన జరిగి నేటితో ఏడాదైంది. అయినా సొంతవారిని కోల్పోయిన వారి కన్నుల్లో.. ఇంకా గంగ పొంగుతూనే ఉంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

7. ఆ ముగ్గురి వల్లనే... బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య..

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రేమికుడు నిరాకరించడం... నటనలో అవకాశాల పేరుతో దగ్గరైన వాళ్లు వేధించగా... బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. కొన్నిరోజులుగా సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

8. కొవిడ్‌పై పోరులో వైద్యుల ఆత్మ బలిదానాలు!

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రేయింబవళ్లు అవిశ్రాంతిగా శ్రమిస్తున్నారు వైద్యులు. కొవిడ్​పై పోరులో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి... వైరస్​ బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందిపైనే పని భారం అధికంగా పెరుగుతోంది. మరి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

9. రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ విజయం.. సిరీస్​ సమం

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్​ అనూహ్య విజయం సాధించింది. తొలి మ్యాచ్​ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది ఇంగ్లీష్​ సేన. ఫలితంగా సిరీస్​ సమం చేసి ట్రోఫీ రేసులో నిలిచింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

10. నటనలో మహారాణి.. వెండితెర శివగామి

అందంతో పాటు అద్భుత నటనతో ప్రేక్షకుల్ని మెప్పించి.. వెండితెరపై ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది నటి రమ్యకృష్ణ. 'బాహుబలి'లో శివగామిగా కనిపించి ప్రేక్షకుల్ని మైమరిపించింది. నేడు రమ్యకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె సినీ కెరీర్​తో పాటు, వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక కథనం మీకోసం.

ABOUT THE AUTHOR

...view details