తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 9AM
టాప్​టెన్​ న్యూస్​@9AM

By

Published : Aug 23, 2020, 8:58 AM IST

  • రాష్ట్రంలో మరో 2,384 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా మరో 2,384 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్​ బారిన పడి 11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 1,04,249కు చేరింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • సీఐడీ విచారణ ప్రారంభం..

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. విచారణాధికారి గోవింద్ సింగ్ నాయకత్వంలో 25మందితో కూడిన బృందం... శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. అనంతరం భూగర్భంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 'కొవాగ్జిన్'​కు మరో కీలక అనుమతి!

భారత్​ బయోటెక్​ సంస్థ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిబంధనల్లో మార్పు చేసేందుకు ప్రభుత్వ ప్యానెల్‌ అంగీకరించిందని సమాచారం. సాధారణంగా కండరాలు, భుజాలకు టీకా ఇస్తారు. అయితే కొవాగ్జిన్​ను చర్మం కింది పొరలో టీకా ఇచ్చే ట్రయల్స్​కు అనుమతినిచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • కర్ర వినాయకుడు..

పర్యావరణానికి హాని కలిగించకుండా కర్రతో వినాయకుడిని తయారు చేశాడు. అందంగా ముస్తాబు చేసి.. ఇంటి ఆవరణలో ప్రతిష్టించాడు. ఈ బొజ్జ గణపయ్యను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • మరో అడుగు దూరం..

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్​ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 587.50 అడుగులకు చేరింది.పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • నిత్యానంద 'కైలాస' దీవిలో హోటల్​..

భారత్​ వదిలి పారిపోయిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ఏర్పాటు చేసిన దేశంలో హోటల్​ ప్రారంభించేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. కైలాసకు వచ్చే భక్తుల కోసం వెరైటీ వంటలను సిద్ధం చేస్తానంటున్నాడు తమిళనాడుకు చెందిన కుమార్​. ఈ మేరకు అనుమతి కోసం నిత్యానందకు లేఖ రాశాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • గేమింగ్ రంగానికి నాయకత్వం వహించాలి..

డిజిటల్ గేమింగ్​ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి భారత్ ఎదగాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏక్‌ భారత్, శ్రేష్ఠ భారత్‌ స్ఫూర్తిని పెంచేందుకు బొమ్మలు ఒక అద్భుతమైన మాధ్యమమని అన్నారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయాలని స్టార్టప్ కంపెనీలు, యువతను కోరారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఒక్కరోజే 2.61 లక్షల మందికి కరోనా

ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. తాజాగా శనివారం ఒక్కరోజే 2 లక్షల 61 వేల 622 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 33 లక్షలు దాటింది. 8 లక్షల 7 వేల మంది మరణించగా.. కోటీ 59 లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. అమెరికా, బ్రెజిల్​, రష్యాలో వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • తడబడిన పాక్..

పాకిస్థాన్​తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్​ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. బ్యాటింగ్​, బౌలింగ్​లో నిలకడగా రాణిస్తూ ప్రత్యర్థిని చిక్కుల్లో పడేసింది. 583 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఆ తర్వాత బరిలో దిగిన పాక్​ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • సూర్య బాటలోనే విజయ్..

తమిళ కథానాయకుడు విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మాస్టర్'. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ద్వారానే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details