తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 9AM
టాప్​టెన్​ న్యూస్​@9AM

By

Published : Aug 18, 2020, 9:03 AM IST

  • నీటి ముంపు ప్రాంతాల్లో కేటీఆర్, ఈటల పర్యటన

భారీ వర్షాలకు అతలాకుతలమైన వరంగల్‌లో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ నేడు పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు... వరంగల్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • తుంగభద్ర నదిలో గల్లంతైన రవికుమార్‌ మృతి

రాష్ట్రంలో భారీ వర్షాలతో పలు నదులు, చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కాగా జోగులాంబ గద్వాల జిల్లాలోని తుంగభద్ర నదిలో గల్లంతైన నిన్న గల్లంతైన రవికుమార్ మృతదేహం లభ్యమయ్యింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • తగ్గుతున్న గోదావరి వరద

నిన్న ఉగ్రరూపం దాల్చి భయపెట్టిన గోదావరి ఈరోజు కాస్త శాంతించింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 57.10 అడుగులుకు చేరి... మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొనసాగుతోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ప్రతి ప్రాణాన్నీ కాపాడాలి.. నిరంతరం పర్యవేక్షణ ఉండాలి: కేసీఆర్‌

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి.. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు భారీ, అతి భారీ వర్ష సూచన ఉన్న దృష్ట్యా.. అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు.పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • జ్వరమా? కరోనా కాకపోవచ్చు!

అసలే కరోనా విజృంభణ, ఆపై వాన కాలం! ఇక చెప్పేదేముంది? ఏమాత్రం ఒళ్లు వెచ్చబడ్డా కరోనా కావొచ్చనే చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. జ్వరమా? లేక కరోనా అనే అయోమయంలో కొవిడ్​ కాకపోవచ్చనీ అనుమానించాల్సి వస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • సృజనకు సోపానం-ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం

అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబరు 30కల్లా పూర్తిచేయాలని దేశంలోని విశ్వవిద్యాలయాలకు సూచించింది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ). విద్యార్థులకు తప్పనిసరిగా మాస్కులు, గ్లవ్స్‌, శానిటైజర్లను అందించాలని, పరీక్ష కేంద్రాన్ని వైరస్‌ సంహార ద్రవాలతో శుభ్రపరచాలని ఆదేశించింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 'కేంద్ర విద్యా శాఖ' పేరుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరు మార్పునకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సచివాలయ వ్యవహార నిబంధన (బిజినెస్ రూల్స్​)ల్లో సవరణలు చేశారు. నూతన విద్యా విధానంతో పాటు మంత్రిత్వ శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ కేంద్ర కేబినెట్​ ఇటీవల నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ట్రంప్‌ విమానాన్ని దాదాపు ఢీకొట్టబోయిన డ్రోన్‌

డొనాల్డ్​ ట్రంప్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్​ఫోర్స్-1 విమానాశ్రయంలో దిగుతుండగా గాలిలో ఎగురుతూ వచ్చిన డ్రోన్‌ ఒకటి దానికి కుడివైపున అత్యంత సమీపానికి వచ్చింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఇంగ్లాండ్‌-పాక్‌ రెండో టెస్టు 'డ్రా'

ఇంగ్లాండ్​ను మరో టెస్టు సిరీస్​ ట్రోఫీ ఊరిస్తోంది. పాకిస్థాన్​తో జరుగుతున్న రెండో టెస్టు డ్రా కావడం వల్ల మూడో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్​ను డ్రా చేసినా.. గెలిచినా టైటిల్​ ఇంగ్లీష్​ జట్టునే వరించనుంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • వంటింట్లో నిత్యా​.. ఈత కొలనులో సన్నీ

లాక్​డౌన్​ విరామ సమయంలో సినీప్రముఖులు ఇంటి వద్దనే ఉంటూ సోషల్​మీడియా ద్వారా తమ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇష్టమైన వ్యాపకాలతోనూ సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా కొంతమంది సినీప్రముఖుల అప్​డేట్లు ఏంటో తెలుసుకుందామా!

ABOUT THE AUTHOR

...view details