'హస్తం' పోరుబాట
విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, ఎంఎస్ఎంఈలకు లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మొత్తం విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
సగం సర్కారుకే!
కార్పొరేట్ ఆసుపత్రుల్లోని కొవిడ్ పడకల్లో సగం రాష్ట్రప్రభుత్వం తన పర్యవేక్షణలోకి తీసుకోనుంది. వాటి కేటాయింపులో పారదర్శకత కోసం ఒక యాప్ తీసుకురానుంది. తద్వారా ఏ ఆసుపత్రిలో ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో తెలిసిపోతుంది. రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రుల నియంత్రణను ఐఏస్ అధికారుల కమిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇవాళ, రేపు వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
బస్తీ వైద్యం
హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలను బల్దియా మరింతగా విస్తరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 167 బస్తీ ఆసుత్రులు ఉండగా.... కొత్తగా 33 ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు బల్దియా ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
శ్రావణం.. శుభకరం
దేశవ్యాప్తంగా శివాలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలు జరిగాయి. ఉత్తర్ప్రదేశ్ వారణాసి, గోరఖ్పుర్, దిల్లీ, మధ్యప్రదేశ్లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు పూజాధికాలు నిర్వహించారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.