1. నగరంలో వాన
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది. మధ్య మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వానపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.కొత్త ఆదేశాలు
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూళ్లపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చికిత్సలు, ఔషధాలు, పరీక్షలకు గరిష్ఠ ధరలను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా సమాచారం కోసం వారంలోగా అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబరుతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కట్టడి వ్యూహం
కరోనా నియంత్రణకు పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో వైరస్ వ్యాప్తి కట్టలు తెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు బంగాల్ కొత్త ఆంక్షలను విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.'పుస్తెలమ్మి కొంటున్నారు'
కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. కరోనా చికిత్స కోసం మహిళలు పుస్తెలు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెమ్‌డెసివిర్ అందుబాటులో ఉంటే ప్రజలు బ్లాక్‌లో ఎందుకు కొంటున్నారని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సర్కార్ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.