1.కర్నల్ కుటుంబానికి ఆర్థిక సాయం
గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సంతోష్‌బాబు చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. కర్నల్ కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థికసాయం, భార్య సంతోషికి ఆర్డీవో ఉద్యోగ నియామక పత్రం, నివాస స్థలం పత్రాలను అందించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
2.గ్రేడ్లు విడుదల
కరోనా విజృంభన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం.. గ్రేడ్లు ప్రకటించింది. అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చింది. నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పరీక్షలకు ఉన్న 20 శాతం మార్కులను వందశాతానికి లెక్కించి గ్రేడ్లు ఇచ్చింది. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు మార్చి నెలలోనే పాఠశాలలు.. ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్లైన్లో పంపించాయి. వాటి ఆధారంగా ఎస్‌ఎస్‌సీ బోర్డు గ్రేడ్లు ఇచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
3.దోస్త్ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశమిచ్చారు. జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు, జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
4.కరోనాతో వైద్యుడు మృతి
రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఓ వైద్యుడు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందాడు. నగరంలో ఓ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న వైద్యుడు జ్ఞానేశ్వర్(70)వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
5.రష్యాకు రాజ్‌నాథ్ అందుకోసమే!
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో రష్యా ఎగుమతి చేసిన యుద్ధ సామగ్రికి సంబంధించి విడిభాగాలు, పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రాజ్‌నాథ్ కోరనున్నట్లు సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.