ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం. లింక్ క్లిక్ చేసి చదివేయండి.మరోసారి సీఎంలతో కరోనా వేళ.. దేశ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.తొలికేసుఇప్పటివరకు ఒక్కకేసు కూడా నమోదుకాని యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. ఒకేసారి కేసులు నమోదవడం వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.దోమల నివారణప్రగతిభవన్లో "ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల" కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ ప్రాంగణంలోనే పూలకూండీలో ఉన్న నీటి నిల్వను తొలగించి.. యాంటీ లార్వా మందులు చల్లారు. ఆయన ఇంకా ఏమన్నారంటే!లిఫ్ట్ గండంఓ వ్యక్తి లిఫ్ట్‌లో తన కుమార్తెతో కలిసి ఇరుక్కుపోయాడు. 40 నిమిషాల పాటు అందులోనే ఉన్నారు. చిన్నారితో పాటు ఆయన భయాందోళనకు గురయ్యారు. కాని.. అందులో నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. అదెలాగంటే..!మరో 50ఏపీలో కరోనా ప్రతాపం చూపెడుతూనే ఉంది. ఇవాళ మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,980కు చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు.దొంగ కరోనాదిల్లీలో నమోదైన కరోనా కేసుల్లో లక్షణాలు కనబడని, స్వల్ప అనారోగ్యానికి గురైనవారే 75 శాతం మంది ఉన్నారని వెల్లడించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆస్పత్రుల్లో చేరని వారికి ఇంటివద్దనే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.పైలట్లకు కరోనాఎయిర్ ఇండియాలో కరోనా కలకలం రేపింది. ఈ విమానయాన సంస్థకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆ సంస్థ తెలిపింది. వీరంతా 3 వారాలుగా విధులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.మిత్ర దేశాలకు సాయంకరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవటమే కాదు.. హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి ఔషధాలను అందించింది భారత్. ఇప్పుడు మరో 5 మిత్ర దేశాలకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలు సహా వైద్య బృందాలను పంపి తన ఉదారతను చాటుకుంది. ఆ విశేషాలు.. మీకోసం.ఐపీఎల్‌కు అరబ్ ఆఫర్కరోనా వల్ల నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధమని యూఏఈ క్రికెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం సాధ్యమేనా?వార్నర్ డైలాగ్‌కు పూరీ ఫిదా! డేవిడ్ వార్నర్ చెప్పిన పోకిరి డైలాగ్‌కు ఫిదా అయ్యారు దర్శకుడు పూరీ జగన్నాథ్. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అంటూ 'పోకిరి'లో మహేశ్ డైలాగ్‌ను చెప్పి, అదరగొట్టాడు వార్నర్. ఈ టిక్‌టాక్ వీడియోను చూసిన పూరీ.. వార్నర్‌కు ఓ ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే..