ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుగ్రీన్ సిగ్నల్.. కరోనా కట్టడి కోసం యాంటీ బాడీస్ తయారీకి భారత్ బయోటెక్‌కు అనుమతులిచ్చింది సీఎస్ఐఆర్. కొవిడ్-19 నివారణకు ఉపయోగపడే మానవ మోనోక్లోనల్ యాంటీ బాడీస్ తయారీ ప్రాజెక్టును సీఎస్ఐఆర్... భారత్ బయోటెక్‌కి అప్పగించింది.మాటలే.. చేతలేవి?తెరాస ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఉత్తమ్ కమెంట్స్ మీ కోసం.మాస్క్ లేకుంటే!కృత్రిమ మేథస్సును ఉపయోగించి మాస్కులు లేకుండా తిరిగే వాళ్లను గుర్తిస్తున్నామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. దేశంలోని తొలిసారిగా తెలంగాణలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు డీజీపీ వెల్లడించారు.బాదుడే!మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన వారిని చితకబాదింది ఓ మహిళ. కరోనా వల్ల ఆకలితో ఇబ్బంది పడుతుంటే మీకు మద్యం కావాలా.. అంటూ నిలదీసింది. వరుసలో నిలబడ్డ వారందరినీ కర్రతో తరిమింది. ఆ వీడియోను మీరూ చూసేయండి!జగడమే!క్రికెట్ ఆడుతుండగా విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ... తారస్థాయికి చేరి ఒకరినొకరు కర్రలతో, బ్యాట్లతో పరస్పరం కొట్టుకున్నారు. ఆ దృశ్యాలను చూస్తే వీళ్లు విద్యార్థులా? లేక రౌడీ షీటర్లా ? అనే సందేహం కలగక మానదు. లైవ్ వీడియో మీరూ చూడండి!కొవిడ్ పంజాఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య ప్రకటించింది. ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 1887కు చేరింది.'మహా' విషాదంవిశాఖ ఘటన మరకముందే మహారాష్ట్రలో మరో జరిగింది. వలస కూలీల బతుకులు నిద్దట్లోనే ముగిసిపోయాయి. 16 మంది నిద్రలోనే అనంతలోకాలకు చేరిపోయారు. అసలేం జరిగిందంటే!రాహుల్ ఫైర్కరోనాపై పోరులో కేంద్రం పారదర్శకంగా వ్యవహరించడంలేదని పరోక్ష విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్. ఆయన లాక్‌డౌన్‌పై చేసిన వ్యాఖ్యలు తెలుసుకోండి..శుభవార్తకరోనా రోగులకు ఎలాంటి చికిత్స చేయాలి? ఇది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. అందుకే రకరకాల విధానాలు అవలంబిస్తున్నారు వైద్యులు. అమెరికా డాక్టర్లు చెప్పిన శుభవార్తేంటి?మ్యాజిక్ మిస్మైదానంలో ప్రేక్షకుల హోరు, కేరింతలు లేకపోతే క్రికెటర్లలో మునుపటిలా ఆడాలనే కసి కనిపించదని అభిప్రాయపడ్డాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. విరాట్ ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు?