వాటర్ బాటిల్ ధర కంటే తక్కువే
కొవాగ్జిన్ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. వాటర్ బాటిల్ ధర కంటే తక్కువ ధరలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తామన్నారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారత్ బయోటెక్ సందర్శన
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించారు. జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కన్నీటి నివాళి
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అంతిమ సంస్కారాలు ఆయన స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సున్నం వారి గూడెంలో నిర్వహించారు. ఆయన కరోనాతో మృతి చెందినప్పటికీ.. ఆ ప్రాంత గిరిజనులు రాజయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేవతలకు ఆహ్వానం
బుధవారం జరగనున్న అయోధ్య రామమందిర భూమిపూజ కోసం దేవాది దేవతలను ఆహ్వానించడానికి రామార్చన పూజను నిర్వహించారు అర్చకులు. మొత్తం నాలుగు దశల్లో ఈ పూజలు జరిగాయి. మరోవైపు రామ మందిర శంకుస్థాపన వేడుక కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేశ ఐక్యతకు నిదర్శనం
అయోధ్య రామమందిర భూమిపూజ దేశ ఐక్యతను చాటుతుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజల సౌభ్రాత్రానికి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.