నేను మొండిఘటం
నర్సాపూర్‌లో కోల్పోయిన అడవికి పునర్జీవం అందించడంలో ప్రజలే కాపాలాదారులు కావాలి.. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కథానాయకులు కావాలిని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కలప స్మగ్లింగ్‌పై మండిపడ్డ సీఎం.. కలప దొంగలను క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
పునరుజ్జీవం
మెదక్ జిల్లాలో ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్... సమష్టికృషితో నర్సాపూర్ అటవీప్రాంతానికి పునర్జీవం వచ్చిందని అన్నారు. సినిమా షూటింగ్‌ల కోసం నర్సాపూర్ అటవీప్రాంతాన్నే ఎంపిక చేసుకునేవారని గుర్తు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
పాలకులకు పట్టడం లేదు
గత 19 రోజులుగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశాయి.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఏపీలో ఉద్ధృతి
ఏపీలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 553 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 10,884కు చేరింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరో జవాన్...
తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో తాజాగా మరొక భారత జవాన్ అమరుడయ్యారు. మహారాష్ట్ర మాలేగావ్‌కు చెందిన సచిన్ విక్రమ్‌కు గల్వాన్ ఘర్షణలో గాయాలయ్యాయి. లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు వీరమరణం పొందారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.