తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@3PM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@3PM
టాప్​టెన్ న్యూస్@3PM

By

Published : Jun 24, 2020, 3:05 PM IST

పెట్రోల్​ రేట్లు అన్​లాక్

దేశంలో కరోనా కేసులతో పాటు పెట్రోల్​ ధరలు పెరగటంపై ప్రధాని మోదీపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పెట్రోల్​-డీజిల్​ ధరలకు, కరోనా మహమ్మారికి (అన్​లాక్​) కేంద్రం తలుపులు తెరించిందని ఆరోపించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

రష్యాలో విక్టరీ పరేడ్

1941-45 మధ్య జరిగిన యుద్ధంలో రష్యా గెలుపునకు చిహ్నంగా యేటా విక్టరీ డే పరేడ్​ను నిర్వహిస్తారు. ఈ సారి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. మాస్కోలో పర్యటిస్తున్న భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

శాంతిలో రష్యా పాత్ర

భారత్​, చైనా దేశాల మధ్య సరిహద్దులో మొదలైన ఉద్రిక్తతలను శాంతింపజేయడంలో రష్యా ప్రధానంగా వ్యవహరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఆ కుటుంబం వల్లే!

కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తిరస్కరణకు గురైన ఒక్క కుటుంబం దుస్సాహసం వల్లే వేలాది కిలోమీటర్ల భూభాగాన్ని భారత్​ కోల్పోయిందని ఆరోపించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

పింఛన్ల కోతపై వివరణ

విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోతపై హైకోర్టులో విచారణ జరిగింది. వేతనాలు, పింఛన్లలో కోత ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ పెన్షనర్ల ఐకాస ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పెన్షనర్ల ఐకాస తరఫు న్యాయవాది వాదించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

అడ్డాకూలీలపై కరోనా

లాక్​డౌన్ అడ్డాకూలీలపై మరింత ప్రభావం చూపిస్తోంది. రోజు ఏదొక పని చేసుకుని పొట్ట నింపుకునే కూలీలకు లాక్​డౌన్ అడ్డుకట్ట వేసింది. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు 5 లక్షల మంది కూలీలు రోడ్డున పడ్డారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

సమస్యకు పరిష్కారం

తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని వ్యాపార వాణిజ్య కేంద్రంగా విరజిల్లుతున్న మధిరలో దశాబ్దాల కాలంగా ఉన్న ప్రధాన సమస్యకు తెరాస లోక్​సభ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు చొరవతో ఎట్టకేలకు పరిష్కారం లభించింది. అక్కడి పట్టణ వాసులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

విచారణ వాయిదా

మాజీమంత్రి అచ్చెన్నాయుడు, ఇఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేశ్ కుమార్​ను తమ కస్టడీకి అప్పగించాలని అనిశా దాఖలు చేసిన పిటిషన్​పై ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ కోర్టులో వాదనలు ముగిశాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

షెడ్యూల్​ ప్రకారం ఆసియా కప్

షెడ్యూల్​ ప్రకారం ఆసియా కప్ జరుగుతుందని పాక్ బోర్డు సీఈఓ వసీమ్ ఖాన్ చెప్పారు. శ్రీలంకలో లేదంటే యూఏఈలో నిర్వహిస్తామని అన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

నవ్వుల మల్లి

పోషించిన పాత్రలతోనే ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయిన అరుదైన నటుడు మల్లికార్జునరావు. ‘అన్వేషణలో పులిరాజుగా అయినా... ‘లేడీస్‌ టైలర్​లో బట్టల సత్యంగానైనా... ఒదిగిపోయి ఆ పాత్రల పేర్లతోనే చలామణీ అయ్యారు మల్లికార్జునరావు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details