తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@3PM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@3PM
టాప్​టెన్ న్యూస్@3PM

By

Published : Jun 23, 2020, 2:59 PM IST

'కరోనాకు మందు'

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి పేర్కొంది. 'కొరోనిల్‌' పేరుతో ఈ మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

కీలక నిర్ణయం

గల్వాన్​ లోయలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించే దిశగా భారత్​- చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. బలగాల ఉపసంహరణపై పరస్పర అంగీకారానికి వచ్చాయి. సోమవారం జరిగిన సైనిక చర్చల ద్వారా ఈ మేరకు పురోగతి సాధించినట్లు భారత సైన్యం వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

వ్యవసాయమిక పండుగే..

సిరిసిల్లలో ఆధునిక రైతుబజార్‌ను కేటీఆర్ ప్రారంభించారు. వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని కేటీఆర్​ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

నో పెండింగ్..

తెరాస ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. కాంగ్రెస్​ నాయకులు ప్రాజెక్టులు పెండింగ్​ పెడితే... వాటిని రన్నింగ్​ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

తీరు మారాలి!

కరోనా కట్టడిపై ప్రతిపక్షాల సలహాలు, సూచనలను తీసుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె.లక్ష్మణ్​ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎంతో మంది ప్రజలు ఈ వైరస్​ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఉద్యోగులకు శుభవార్త..

మంత్రి హరీశ్‌రావును కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక జూన్ నెల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని, 3 నెలల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జూన్​ నెల నుంచి జీతాలు, పింఛన్లు ఇవ్వడానికి ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అంగీకరించారు. బకాయిలను వాయిదాలలో ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

నేపాల్ కాలుదువ్వుతోంది!​

భారత్-చైనా సరిహద్దులో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మరో పొరుగుదేశం నేపాల్ కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్​లోని ప్రాంతాలను తమ దేశంలో అంతర్భాగంగా పరిగణిస్తూ మ్యాప్​ను రూపొందించి​.. మరిన్ని వివాదాలు రాజేసేందుకు ప్రయత్నిస్తోంది. సరిహద్దులో మొదలైన ఘర్షణను ఇతర మార్గాలకూ విస్తరిస్తోంది.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

అమెజాన్​లో మద్యం

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మద్యం హోం డెలివరీకి సిద్ధమైంది. ఇందుకోసం అమెజాన్​కు బంగాల్​ ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. నిత్యావసరాల హోం డెలివరీ సంస్థ బిగ్​బాస్కెట్​కూ ఈ తరహా సేవలకు అనుమతి లభించినట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

రంగుల రింగులు..

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్​ 23వ తేదీని ఒలింపిక్ దినోత్సవంగా జరుపుతారు. అన్ని దేశాల్లో ఈ రోజున క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేకమైన పరుగు కార్యక్రమాలు, ఎగ్జిబిషన్​ మ్యాచ్​లు, క్రీడలపై సెమినార్లు నిర్వహించి ఆటల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సందడి తగ్గింది.షెడ్యూల్​ ప్రకారం.. ఈ ఏడాది​ జులై 24న ప్రారంభం కావాల్సిన విశ్వక్రీడలు రద్దయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

రియల్ హీరో.. ​

లాక్​డౌన్​ వల్ల ఇంటికే పరిమితమైన బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. తాజాగా పొలం పనులు చేస్తూ కనిపించారు. నెట్​ఫ్లిక్స్​లో 'సేక్రెడ్​ గేమ్స్'తో ఈ ఈయన గుర్తింపు పొందారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details