.సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. రైతుబంధు ఇవ్వమనే బెదిరింపులు మానుకోవాలి: కోదండరాంహైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, సాయిబాబా హాజరయ్యారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ చర్యలు, మద్యం దుకాణాలు తెరవడంపై చర్చించారు. రైతుబంధు ఇవ్వమన్న ప్రభుత్వ బెదిరింపులను అఖిలపక్షం ఖండిస్తుందని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ఈటల చొరవ.. రాష్ట్రానికి వలస కూలీలుఉపాధి లేక, నిత్యావసరాలు లభించక మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన కూలీలు ఇబ్బంది పడుతున్నారు. వారి విజ్ఞప్తికి స్పందిచిన మంత్రి ఈటల.. ప్రత్యేక బస్సు ద్వారా వారందరిని స్వస్థలాలకు చేర్చారు. రైళ్లలో వారు ఊరెళ్లడం ఇక మరింత ఈజీవలస కార్మికులను తమ స్వస్థలాలకు చేరవేసేందుకు నడుపుతున్న ప్రత్యేక శ్రామిక్ రైళ్ల స్టాపులు, ప్రయాణికుల సంఖ్యలో మార్పులు చేసింది రైల్వేశాఖ. రైలు బయలు దేరిన చోటు నుంచి మూడు స్టాపుల్లో ఆపాలని.. ప్రయాణికుల సంఖ్యను 1200 నుంచి 1700లకు పెంచాలని నిర్ణయించింది. రామ మందిర పరిసరాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం!అయోధ్యలోని రామ మందిర పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి.. 'కాలువ'లో ప్రయాణందేశంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మహారాష్ట్రలో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల.. వందలాది కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా మురుగు కాలువలో నడుచుకుంటూ స్వస్థలాలకు బయలుదేరారు. కశ్మీర్లో '4జీ'కి సుప్రీం నో... కమిటీ ఏర్పాటుజమ్ము కశ్మీర్లో 4జీ సేవల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. జాతీయ భద్రత, మానవ హక్కుల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారీ క్షీణతఅమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డ్ స్థాయిలో క్షీణించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. 2009 ఆర్థిక మాంద్యం తర్వాత 2019లోనే కనిష్ఠానికి పడిపోయినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది కూడా జనవరి-మార్పి మధ్య అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు సుమారు 200 మిలియన్ డాలర్లు తగ్గాయని తెలిపింది.కరోనాతో పర్యటకానికి 1.2 ట్రిలియన్ డాలర్ల నష్టం!కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పర్యటక రంగం స్తంభించిపోయింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారీ నష్టం తప్పదని ప్రపంచ పర్యటక సంస్థ అంచనా వేసింది. 2020లో పర్యటక రంగ వ్యాపారం 80 శాతం మేర క్షీణిస్తుందని.. ఫలితంగా 1.2 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని లెక్కగట్టింది. సల్మాన్.. 'తేరే బినా' టీజర్ విడుదలబాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'తేరే బినా' మ్యూజికల్ వీడియో టీజర్‌ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మే 12న పూర్తి వీడియోను విడుదల చేయనున్నట్లు తెలిపాడు సల్మాన్.