ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం. లింక్ క్లిక్ చేసి చదివేయండి.తొలికేసు ఇప్పటివరకు ఒక్కకేసు కూడా నమోదుకాని యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. ఒకేసారి కేసులు నమోదవడం వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.దోమల నివారణప్రగతిభవన్లో "ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల" కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ ప్రాంగణంలోనే పూలకూండీలో ఉన్న నీటి నిల్వను తొలగించి.. యాంటీ లార్వా మందులు చల్లారు. ఆయన ఇంకా ఏమన్నారంటే!ప్లాస్మా థెరపీరాష్ట్రంలో సోమవారం నుంచి ప్లాస్మాథెరపీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న 15 మంది ముందుకు వచ్చారు. వైద్యులు వారి నుంచి సోమవారం రక్తం సేకరించనున్నారు.బస్సుల్లో ఎలా?లాక్డౌన్ తర్వాత ప్రజారవాణాలో రానున్న మార్పులేంటి? అసలు ఆర్టీసీ బస్‌లు ఎప్పటి నుంచి నడుస్తాయి? సీట్లు మునుపటిలానే ఉంటాయా? లేదా వాటిలో ఏమైనా మార్పులు చేయబోతున్నారా? సంబంధించిన కథనం కోసం క్లిక్ చేయండి.మరో 50ఏపీలో కరోనా ప్రతాపం చూపెడుతూనే ఉంది. ఇవాళ మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 1,980కు చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు.కోమాలో మాజీ సీఎంఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పగలే చీకటిదేశరాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దిల్లీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్లపై వాహనాలు కూడా కనిపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దృశ్యాల్ని మీరూ చూడండి.ఒబామా పంచ్! కరోనా మహమ్మారి కట్టడిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ట్రంప్.. వైరస్‌ను ఎదుర్కొన్న తీరును 'గందరగోళ విపత్తు'గా అభివర్ణించారు. ఒబామా పంచ్‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.క్రికెటర్ నోట పోకిరి డైలాగ్!'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అంటున్నాడు ఓ ఫేమస్ క్రికెటర్. 'పోకిరి'లో మహేశ్ డైలాగ్‌ను చెప్పి, అదరగొట్టాడు. ఈ టిక్‌టాక్ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఇంతకు ఆ క్రికెటర్ ఎవరో మీరూ తెలుసుకోండి.రౌడీకి నిర్మాత పోకిరివిజయ్ దేవరకొండ హీరోగా నటించబోయే ఓ సినిమాను మహేశ్‌బాబు నిర్మించబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ విషయమై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ విశేషాలు మీకోసం.