1. 'రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త వ్యవసాయ చట్టం'
వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేలా కేంద్రం బిల్లులు తీసుకొస్తోందని రాజ్యసభలో తెరాస ఎంపీ కె.కేశవరావు మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బిల్లుల రూపకల్పన జరిగిందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. చైనాలో మరో వ్యాధి..
చైనాలో మరో వ్యాధి వెలుగులోకి వచ్చింది. వేలాది మంది ప్రజలకు ఈ వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధరించారు. బాధితులకు తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని లక్షణాలు దీర్ఘకాలం పాటు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
3. రాజ్యసభలో వాడీవేడి చర్చ
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకంగా ఉన్నాయంటూ తెరాస ఎంపీలు విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
4. సాగర్‌కు భారీ వరద..
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఇన్‌ఫ్లోగా 2 లక్షల 79 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఫలితంగా సాగర్ జలాశయం 16 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి స్పిల్ వే నుంచి 2 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
5. గూడ్స్ బండీ... కొత్తగా మారెనండీ!
మనకెప్పుడూ గూడ్సు రైలంటే చిన్నచూపే! కానీ కరోనా వేళ ఆ గూడ్సు రైలే దేశవ్యాప్తంగా ఆహారం కొరత రాకుండా చూసుకుంది. ఇందుకోసం తన రూపాన్నీ మార్చుకుని, వేగాన్నీ పెంచుకుంది. ఫలితంగా కరోనా వేళ దేశంలో మరే సరకు రవాణా సంస్థ అందుకోనన్ని లాభాల్ని సొంతం చేసుకుంది. దీని వెనక ఆయా రైల్వే డివిజన్‌లు చేపట్టిన వినూత్న ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఆసక్తికరమైన ఆ విశేషాలేమిటో చూద్దామా!...