1. పదా అన్న ఇళ్లు చూసివద్దాం...
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను హైదరాబాద్‌లో నిర్మిస్తోన్న రెండు పడకగదుల ఇళ్లను చూసేందుకు మంత్రి తలసాని వెంట తీసుకెళ్లారు. అసెంబ్లీలో నిన్న జరిగిన చర్చలో హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కడ కట్టారో చూపించాలని భట్టి డిమాండ్ చేయగా మంత్రి స్పందించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
2. ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ విషయంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎల్ఆర్ఎస్ పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. తుదితీర్పునకు లోబడి ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని పిటిషనర్ కోరారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
3. తెలంగాణ భవన్‌లో జెండాను ఎగురవేసిన మంత్రి కేటీఆర్..
తెలంగాణ భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
4. తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఐఎస్..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అత్యంత క్రీయాశీలంగా ఉందని కేంద్ర హోంశాఖ రాజ్యసభలో తెలిపింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
5. మోదీ పుట్టినరోజు.. రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని భాజపా నాయకులు ప్రత్యేక పూజలు చేయించారు. మోదీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రామయ్యను కోరుకున్నట్లు భాజపా నేతలు తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి