1. త్వరలోనే వార్డు ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తాం...
హైదరాబాద్ ఓఆర్ఆర్పై 19 ఇంటర్ చెంజ్ల వద్ద ఫుడ్‌కోర్టులు, రెస్ట్ ఏరియాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ గాంధీ జయంతినాటికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు కలిపి 11 వేల పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేస్తున్నామన్నారు. వార్డు ఆఫీసర్ పోస్టులపై మండలిలో మంత్రి ప్రకటన చేశారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి..
2. మోదీ నిర్ణయాత్మక విధానాలు దేశానికే ఆదర్శం
మోదీ నిర్ణయాత్మక విధానాలు దేశానికే ఆదర్శనీయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి..
3. వ్యవసాయ క్లస్టర్ల పునర్విభజన పూర్తిచేస్తాం..
కరోనా సంక్షోభంలోనూ రైతుబంధు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో క్లస్టర్ల పునర్విభజన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి..
4. జల దిగ్బంధంలో వనపర్తి..
రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వానకు... వనపర్తి జలదిగ్బంధమైంది. తాళ్లచెరువు పొంగిపొర్లడంతో రహదారులు, రోడ్లు అన్ని పూర్తిగా జలమయమైపోయాయి. నివాసాలు, వ్యాపార సముదాయాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి..
5. ఎంజీఎంలో రోగులకు తప్పని తిప్పలు..
ఓపీ విభాగంలో కంప్యూటర్లు మొరాయించడంతో రోగులు, రోగి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చోటు చేసుకుంది. అధికారుల నుంచి ఆదేశాలు వస్తే చిట్టీలు ఇస్తామని సిబ్బంది వెల్లడించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి..