తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@1PM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 1PM
టాప్​టెన్​ న్యూస్​@1PM

By

Published : Sep 12, 2020, 12:59 PM IST

  • బంగారం గనిలో ప్రమాదం.. 50 మంది మృతి

కాంగోలో బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరిపి 50 మంది ప్రాణాలను కోల్పోయారు. తవ్వకాలు చేస్తుండగా గని ఒక్కసారిగా కూలడం వల్ల ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • రామగుండం చేరుకున్న కేంద్రమంత్రులు

కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మాంధవ్యా రామగుండం చేరుకున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రామగుండానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారు. కర్మాగారం సమస్యలు, అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • కూలీ నుంచి ఐపీఎస్​..

కూలి పనులకు వెళ్తూనే డిగ్రీ, పీజీలు చేశాడు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జాబ్‌ వరించింది. ఆర్థిక భరోసాతోపాటు గౌరవమూ పెరిగింది. అయినా ఆగిపోలేదు.పేదల తలరాతను రాసే సివిల్స్‌కి గురి పెట్టాడు. ఆరో ప్రయత్నంలో ఐపీఎస్‌ దక్కించుకున్నాడు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి ఛార్జ్‌ తీసుకోబోతున్నాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • చెరువు మాయమైంది.. కాలువ కబ్జా అయింది!

అక్రమ నిర్మాణాల పుణ్యమా అని చెరువులు, కాలువలు చిన్నబోతున్నాయి. ఒకప్పుడు వందల ఎకరాల్లో విస్తరించి ఉండే చెరువులు ఇప్పుడు 30, 40 ఎకరాలకు కుంచించుకుపోతున్నాయి. నాలాలు కబ్జాలు చేసి.. గోడలు కట్టడం వల్ల వరద నీరు.. కాలనీల వైపు పరుగులు తీస్తోంది. వరంగల్​ జిల్లాకేంద్రంలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, కాలువలపై ప్రత్యేక కథనం.

  • గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్​ వ్యూహరచన..

గ్రేటర్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్‌.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకి అనుకూలంగా మార్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం విఫలం..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కరోనా నియంత్రణలో ప్రధానిగా మోదీ విఫలమయ్యారని, ఫలితంగా జీడీపీ తగ్గుదల, నిరుద్యోగిత వంటి కొత్త సమస్యలు ఏర్పడ్డాయని ఆరోపించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • కొవిడ్‌ వేళ .. కలవరపెడుతున్న 'రక్తహీనత'

ప్రపంచ వ్యాప్తంగా మూడోవంతు ప్రజల్లో సంక్రమించే వ్యాధులకు, సంభవించే మరణాలకు రక్తహీనతే కారణమవుతోంది. కరోనా విజృంభిస్తున్న వేళ రక్తహీనత సమస్య మరింత కలవరానికి గురిచేస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • అంకురాలపై మరో ఏడాది కరోనా ప్రభావం

దేశ ఆర్థిక స్థితిగతులను మార్చ గలిగే శక్తి అంకురాలకు ఉంది. కరోనా మూలంగా వాటిపై చాలా వరకు ప్రతికూల ప్రభావం పడింది. లాక్‌డౌన్‌ కంటే పరిస్థితులు ఇప్పుడు మెరుగు పడ్డప్పటికీ పెట్టుబడుల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉందని అంకురాల ప్రతినిధులు చెబుతున్నారు. సంవత్సరం వరకు పరిస్థితి ఇలాగే ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • జాంటీ రోడ్స్‌కే క్యాచ్‌లు నేర్పిస్తున్న మయాంక్‌

ఐపీఎల్‌ 13వ సీజన్‌ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. దీంతో అన్ని జట్ల ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. తాజాగా కింగ్స్​ ఎలెవెన్ పంజాబ్​​ జట్టు ప్రాక్టీస్​లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ జట్టు ఫీల్డింగ్​ కోచ్​, ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన జాంటీ రోడ్స్​కే క్యాచ్​లు పట్టడం నేర్పించాడు ఆ జట్టు ఆటగాడు మయాంక్​ అగర్వాల్​. ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది ఫ్రాంఛైజీ. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

  • బుల్లితెరపై 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'...

సేత్యదేవ్​ హీరోగా తెరకెక్కిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'.. ఇటీవల ఓటీటీలో విడుదలై ఫీల్​గుడ్​ మూవీగా పేరు సంపాదించుకుంది. ఈ చిత్రం సెప్టెంబరు 13న(ఆదివారం) ఈటీవీ ఛానల్​లో​ ప్రసారం కానుంది.

ABOUT THE AUTHOR

...view details