1. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా..ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
2. చెత్త ట్రాక్టర్‌లో కరోనా యోధుల తరలింపు..
కరోనా సోకిన 9 మంది పారిశుద్ధ్య కార్మికులను అధికారులు చెత్త ట్రాక్టర్‌లో తరలించారు. దీనిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పురపాలిక వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
3. శాంతిస్తోన్న గోదారి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం గోదావరిలో సుమారు 7 అడుగుల మేర నీటి మట్టం తగ్గింది. ప్రస్తుత నీటి మట్టం 46.8 అడుగులకు చేరింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
4. పరిశ్రమలకూ భగీరథ నీళ్లు..!
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లానీరు... పదుల సంఖ్యలో ఇన్‌టేక్ వెల్స్, వందల్లో శుద్ధికేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అందుకు అనుగుణంగా విద్యుత్ కేంద్రాలు, వేలాది ఓవర్ హెడ్ ట్యాంకులు, లక్ష కిలోమీటర్లకుపైగా పైపు లైన్లు... ఇదీ మిషన్ భగీరథ స్వరూపం. గ్రామీణ, పట్టణప్రాంతాల్లో మొత్తం తాగు, సాగునీటి రూపురేఖల్ని మార్చేందుకు ఈ పథకం ప్రత్యేకంగా రూపుదిద్దుకొంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
5. షూటింగ్‌లకు అనుమతిచ్చిన కేంద్రం
కరోనా కారణంగా అన్ని సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. దేశంలో మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ఆలోచనలో పడ్డ కేంద్రం ఎట్టకేలకు షూటింగ్స్‌కు అనుమతిచ్చింది. అన్ని జాగ్రత్తలను పాటిస్తూ చిత్రీకరణలు జరుపుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి