1. రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు..
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. మహమ్మారితో పోరాడి వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో జరిపిన నిర్ధరణ పరీక్షల్లో మరో 2,159 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
2. రికార్డ్ స్థాయిలో: కొత్తగా 97,894 కేసులు..
దేశంలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చుతుంది. కొత్తగా 97,894 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1,132 మంది కొవిడ్‌కు బలయ్యారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
3. నిజాం రాజ్యం కుప్పకూలిన క్షణమిదే!
నిజాం ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రజలు, నాయకులు నిప్పులు కక్కుతున్న సమయంలో నిజాం సర్కార్‌ను తరిమికొట్టి తెలంగాణ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలని ఆనాటి ప్రభుత్వం సంకల్పించింది. 1948 సెప్టెంబరు 13న ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
4. మరో క్రిమిసంహారక మందుపై నిషేధం..
ఆల్ఫా నాప్థైల్ ఎసిటిక్ ఆసిడ్‌ను రైతులు వినియోగించవద్దని... ప్రభుత్వం సూచించింది. ఇది నాసిరకమైన బ్రాండ్ అని ఛండీనగర్కు చెందిన పురుగు మందుల పరీక్షా కేంద్రం తెలిపింది. దీనిని ఎక్కడా నిల్వచేయకూడదని... రైతుల గమనించాలని సూచించింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
5. ప్రారంభంకానున్న కేబుల్‌బ్రిడ్జి..
హైదరాబాద్‌కే మకుటాయమానంగా మారనున్న దుర్గం చెరువు వంతెన పనులు పూర్తయ్యాయి. ఎంతో అందంగా, అద్భుతంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఈ నెల 19న నగరవాసులను అందుబాటులోకి రానుంది. దీనితో పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 పైవంతెన సేవలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి