- ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఖరారు..
వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈనెల 31న టీఎస్ ఈసెట్ నిర్వహణ.. సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. 21 నుంచి 24 వరకు పీజీఈసెట్.. 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్.. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్ నిర్వహణకు సన్నాహాలు చేయనున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ప్రధాని పండుగ శుభాకాంక్షలు
వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా దేశ ప్రజలపై ఉంటాయని మోదీ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- జలవిద్యుత్‌కు ఆయువు పట్టు..
ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి రివర్సబుల్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన జల విద్యుత్ కేంద్రంగా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ప్రావిణ్యం గావించింది. 1.2 కిలోమీటర్ల భూగర్బంలో నిర్మించిన దేశంలోని మొట్టమొదటి విద్యుత్ కేంద్రంగా కూడా చెప్పుకోవచ్చు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం అనేక ప్రత్యేకతలను, సాంకేతికతను సొంతం చేసుకుంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- వాగు దాటి వైద్యం..
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి మనోహర్ ఇంద్రవెల్లి పీహెచ్సీ, వైద్య సిబ్బందితో మండలంలోని మార్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడి గూడా గ్రామానికి చేరుకున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- వెలుగులు ఇంట.. కారు చీకట్లు
జనాలకు వెలుగులు పంచిన చిరుదివ్వెలు వారు. అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంలో ఆహుతులయ్యారు. విధి నిర్వహణలో బలైపోయి... కుటుంబసభ్యులకు దూరంగా అనంతలోకాలకు తరలిపోయారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదం... నిండు జీవితాలను కాలగర్భంలో కలిపేసింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- శాంతించిన గోదారమ్మ..