తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ ​న్యూస్​@ 11 AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 11 AM
టాప్​టెన్ ​న్యూస్​@11AM

By

Published : Sep 19, 2020, 11:00 AM IST

1. ఒక్కరోజులో 93,337 కేసులు..

భారత్​లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 93,337 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

2. 'ఆన్‌లైన్‌' పాఠాలు..

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కరోనా సమయంలోనూ విదేశీ విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి.. అమెరికా విశ్వవిద్యాలయాల తరహాలో దేశానికి రాకుండానే ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

3. యాదాద్రిలో కళారూపాలు..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో శిల్ప కళా రూపాలు ఆకట్టుకుంటున్నాయి. భక్తి భావాలను ప్రదర్శిస్తున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

4. 'నాలాల అలక్ష్యం'..

'మహానగరంలో నాలాలు విస్తరిస్తాం.. వాటిపై జాలీలు నిర్మిస్తాం.. చుట్టూ ప్రహరీలు నిర్మిస్తాం' అంటూ చెప్పే యంత్రాంగం ప్రకటనలు గాలిమూటలవుతున్నాయి. ఫలితంగా ఓపెన్‌ నాలాల బారినపడి చిన్నారులు, గర్భిణులు, యువకులు అసువులు కోల్పోతున్నారు.పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

5. వర్షాకాలంలోనే నీటి వెతలు..

వేసవి రాకముందే ఆ మహిళలకు నీటికష్టాలు మొదలయ్యాయి. తాగేందుకు నీరులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో మూడునెలలుగా మంచినీరు రావడం లేదని బాధితులు బిందలతో రోడ్డెక్కారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

6. అల్​ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్..

అల్​ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా కార్యకలాపాలు సాగిస్తోన్న 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బంగాల్​, కేరళలో జరిపిన సోదాల్లో వీరు పట్టుబడ్డారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

7. పక్షవాత స్కాన్లతో కరోనా నిర్ధారణ..

కరోనా గుర్తించేందుకు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు బ్రిటన్​ శాస్త్రవేత్తలు. పక్షవాతాన్ని గుర్తించేందుకు వాడే స్కాన్లతో కరోనాను కనిపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో మెదడుకు గాయమైనట్లు అనుమానమున్న వారిలో కొవిడ్ బాధితులను త్వరగా గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

8. టెలికాం టారిఫ్‌లు అర్థం కావాలి..

టారిఫ్​ల విషయంలో మరింత పారదర్శకంగా ఉండాలని టెలికాం సంస్థలకు ట్రాయ్​ స్పష్టం చేసింది. వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా ఉండాలని పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

9. ధోనీ ఈజ్​ బ్యాక్​..

చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య పోరుతో నేడు ఐపీఎల్​ మొదలవనుంది. చాలా కాలం తర్వాత ధోనీ రాకతో అతడి అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నెలకొంది. ఈ సందర్భంగా ట్విట్టర్​ వేదికగా 'ధోనీ ఈజ్ బ్యాక్' అనే​ హ్యాష్ ​ట్యాగ్​ ట్రెండింగ్​లో నిలిచింది. పూర్తి వివరాాలకై క్లిక్​ చేయండి

10. 'పొన్నియన్ సెల్వన్' వాయిదా..

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details