తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1 PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 1 PM
టాప్​టెన్​ న్యూస్​ @1 PM

By

Published : Aug 22, 2020, 12:59 PM IST

  • ఆయన రూపం వెనుక పరమార్థం ఇదే!

వక్రతుండ మహాకాయ! కోటిసూర్య సమప్రభ! నిర్విఘ్నం కురు మే దేవ! సర్వకార్యేషు సర్వదా... అంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించే పర్వదినం వినాయక చవితి. ఈ రోజున పాలవెల్లిని అలంకరించడం, పత్రితో పూజ చేయడం, కుడుములను నైవేద్యం పెట్టడం... భక్తి శ్రద్ధలతో కథ వినడం... ఇలా అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. అయితే వాటికి కొన్ని అంతరార్థాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే క్లిక్​ చేయండి

  • మూషికా..! మనం వచ్చింది భూలోకానికేనా..!

మూషికా..! మనం వచ్చింది భూలోకానికేనా!? ఎక్కడా చతుర్థి వేడుకలు హంగులు ఆర్భాటాలు కనిపంచడం లేదేమిటీ అని ఈ ఏడాది గణనాధుడే ఆశ్చర్యానికి గురవుతున్నాడు. ఇదేమైనా విధి వైపరీత్యమా.. లేక గణనాథుని జన్మ గణనలో తప్పిదమేమైనా జరిగిందా అంటూ మూషికతో మాట్లడుతున్డ్నాడు మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..! పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • సంజయ్​.. వినాయక చవితి శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సమాజంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి గణేష్ ఉత్సవాలు సామాజిక బంధంగా పెనవేసుకున్నాయని వెల్లడించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఖైరతాబాద్​ ధన్వంతరి నారాయణుడు..

హైదరాబాద్‌లో ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి అభయమిస్తున్నాడు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఈగ ఫిక్షనల్‌.. ఎలుక ఒరిజినల్‌..

అనగనగా.. ఓ ఈగ. పూర్వ జన్మలో తనను చంపినందుకు విలన్‌ను ముప్పుతిప్పలు పెడుతుంది. చివరికి ఓ అగ్నిప్రమాదంతో చంపి తన ప్రతికారం తీర్చుకుంటుంది. ఇదీ ఈగ సినిమా కథ.. కానీ అలాంటి సీన్​ తాజాగా హైదరాబాద్​ ముషీరాబాద్​లో ఎలుకవల్ల జరిగిందంటే మీరు నమ్ముతారా..! పూర్తి వివరాకి ఈ కథనాన్ని ఓ లుక్కేయండి

  • చొరబాటుదారులు హతం..

సరిహద్దు వెంబడి చొరబాటు కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. పంజాబ్​​లోని భారత్​-పాక్​ అంతర్జాతీయ సరిహద్దు తారన్​ తరన్​ గుండా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 'ఆ పోస్టుల తొలగింపులో పక్షపాతం లేదు'

ఫేస్​బుక్​ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు భారత్​లో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్​, ఎండీ అజిత్​ మోహన్​. విద్వేశాలను రెచ్చగొట్టే సందేశాల తొలగింపులో ఎలాంటి పక్షపాతానికి చోటులేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 8 లక్షలు దాటిన కరోనా మరణాలు

ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 31 లక్షలు దాటింది. 8 లక్షల మంది మరణించగా.. కోటీ 57 లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. అమెరికా, బ్రెజిల్​, భారత్​, రష్యాలో వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • భవిష్యత్ ప్రణాళికలపై గంగూలీ మాటిదే!

కరోనా కారణంగా వాయిదా పడ్డ సిరీస్​లపై ఇప్పుడిప్పుడే ఓ స్పష్టత వస్తోంది. తాజాగా టీమ్​ఇండియా భవిష్యత్​ ప్రణాళికలతో పాటు దేశవాళీ టోర్నీల నిర్వహణపై స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • మెగాస్టార్ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఆయనే!

ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాన్ని ఓ సందర్భంలో వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. ఓ కానిస్టేబుల్ వల్లే సినిమాల్లో అడుగుపెట్టానని తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details