సైనిక సన్నద్ధతపై సమీక్ష
చైనాతో సరిహద్దు వివాదం, మిలిటరీ చర్చల్లో పురోగతి నేపథ్యంలో... ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లద్దాఖ్‌లోని నిము ప్రాంతంలో ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో భేటీ అయిన మోదీ... సరిహద్దు భద్రతా పరిస్థితులను సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
గోదారమ్మ పరుగులు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపుహౌజ్ నుంచి నీటి పారుదల శాఖ అధికారులు ఎత్తిపోతలు ప్రారంభించారు. 3150 క్యూసెక్కుల జలాలను ఎస్సారెస్పీ వరద కాలువలోకి తరలిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
గర్భిణుల ఆవేదన
హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కొత్తగా వచ్చే గర్భిణులకు వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. దీనితో గర్భిణులు వెనుతిరిగి పోతున్నారు. తమకు వైద్యం ఎందుకు అందించడం లేదని ఆసుపత్రి సిబ్బందితో గర్భిణులు వాగ్వాదానికి దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
భారత్‌లో రెండో వ్యాక్సిన్
భారత ఫార్మా దిగ్గజం జైడస్ కాడిలా సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ మానవులపై ప్రయోగించేందుకు డీసీజీఐ అనుమతించింది. ఇప్పటికే వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగించి విజయవంతమైంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
జల ప్రళయం
అసోంలోని 22 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మొత్తం 16 లక్షల మంది ప్రభావితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 34 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.