ఈరోజు ఇప్పటివరకు జరిగిన ప్రధాన వార్తల సమాహారం మీ కోసం. ఆసక్తికర కథనాల లింక్స్‌ను క్లిక్ చేసి చదివేయండి.కీలక సమీక్ష కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. వ్యవసాయ రంగంపై సమాలోచనలు చేశారు. పౌర సరఫరాలపై ఆరా తీశారు. సమీక్ష పూర్తి సమాహారం కోసం క్లిక్ చేయండి. మేం వ్యతిరేకంకేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం సహా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని యోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. బిల్లును వ్యతిరేకించి తీరుతామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అసలా బిల్లేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే...తస్లీ 'మా'ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నంపెట్టి.. అమ్మైంది. పేదోళ్లకు చదువు చెప్పించి అక్కైంది. అవసరం, ఆపద ఎక్కడ ఉంటే ఆమె అక్కడ వాలిపోతోంది. ఆమె ఎవరంటే...వర్షాలురాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.'ఎల్జీ' ఉద్యమంఆంధ్రప్రదేశ్లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద వెంకటాపురం వాసులు ధర్నాకు దిగారు. పరిశ్రమను అక్కడి నుంచి తరలించాల్సిందేని ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.ఆగని కరోనా ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ 43 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది. మరణాల సంఖ్య 44కు చేరింది.నేను బానే ఉన్నా!తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఇవాంక 'పీఏ'కు కరోనా!శ్వేతసౌధంలో కరోనా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్ 'పీఏ'కు కొవిడ్ సోకింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం..యూవీకి నచ్చిన షాట్!కెరీర్ మొత్తంలో తనకిష్టమైన క్రికెట్ షాట్ ఇదేనంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. దీనిపై పలువురు క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ షాట్ గురించి మీరూ తెలుసుకోండి!సల్మాన్ నోట పాటబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్.. మరోసారి తనలోని గాయకుడిని బయటకు తీశారు. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి ఓ పాడారు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. కండల వీరుడు పాడిన పాట ఏంటంటే?