'కేసీఆర్ వల్లే ఉపద్రవం'
సీఎం కేసీఆర్ అనాలోచిత వైఖరితోనే రాష్ట్రంలో కరోనా ఉపద్రవం ముంచుకొచ్చిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. జూమ్ యాప్ ద్వారా జిల్లా అధ్యక్షులతో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ధాన్యం బస్తాల్లో ఇసుక
ధాన్యం లారీలో వడ్లకు బదులుగా నూకలు, ఇసుక కలిపి మోసానికి యత్నించారు కొందరు నిర్వాహకులు. రైసు మిల్లు వద్ద లోడు దించుతుండగా ఈ మోసం బయటపడింది. కరీంనగర్ జిల్లా పోరండ్లలోని రైసు మిల్లు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
మిరపకాయలు తెంచడానికి వెళ్లిన కూలీలపై పిడుగు పడింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రూ.2 కోట్ల కొలువు..
హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థినికి అమెరికాలో రూ. 2 కోట్ల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో.. తెలుగు తేజానికే అత్యధిక వేతనం లభించడం హర్షణీయం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాక్డౌన్ పొడిగింపు
కరోనా వ్యాప్తి అదుపులో లేనందున దిల్లీలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దిల్లీ బాటలోనే హరియాణా, జమ్ముకశ్మీర్‌లు నడుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.