తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News: టాప్​న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
top news in telangana

By

Published : Jul 26, 2022, 3:00 PM IST

  • 11 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ వేటు

11 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ వేటు పడింది. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వారందరిపై ఈమేరకు చర్యలకు తీర్మానించింది ఎగువసభ. వారం రోజులు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు.

  • రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు

రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో భారీ వానలు పడతాయని వెల్లడించింది. రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. గురువారం రోజున తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.

  • ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్​..

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం విజయవాడలో ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 3,01,172 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్‌ పరీక్ష 1,94,752, వ్యవసాయ కోర్సు పరీక్ష 87,744 మంది రాశారు. ఇంజినీరింగ్‌లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. వ్యవసాయ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.

  • వానొచ్చింది.. వరద తెచ్చింది.. ముంచింది

Rains In Hyderabad: భాగ్యనగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. గాజులరామారం, ఎల్బీనగర్​లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.

  • పెద్ద చెరువు అలుగు అందం..

Sangareddy Rains : సంగారెడ్డి జిల్లాలోని మల్కాపూర్-తొగరపల్లి పెద్ద చెరువు ఉప్పొంగి పారుతోంది. అలుగు పారుతున్న చెరువు అందాలను చూడటానికి ప్రజలు ఎగబడుతున్నారు. కానీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు కంచె ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ కంచె దాటొద్దని హెచ్చరించారు.

  • ఈడీ విచారణలో సోనియాకు లంచ్ బ్రేక్..

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి.. ఈడీ అధికారులు భోజన విరామం ఇచ్చారు. ఆమె ఎన్​ఫోర్స్​మెంట్ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లారు. విచారణ కోసం మళ్లీ మధ్యాహ్నం మూడున్నరకు తిరిగి రావాలని అధికారులు ఆమెకు సూచించారు. నేషనల్​ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి వేర్వేరు కోణాల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది.

  • చెస్​ ఆడుతుండగా రోబో 'పైశాచికం'..

Robot Chess finger break : ఏడేళ్ల బాలుడితో చెస్​ ఆడుతున్న రోబో.. ఒక్కసారిగా ఆ పిల్లాడి వేలు విరిచేసింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు ఖంగుతిన్నారు. రోబో చెర నుంచి బాలుడ్ని విడిపించారు.

  • కామన్‌వెల్త్ గేమ్స్​కు నీరజ్​ చోప్రా దూరం

కామన్‌వెల్త్ గేమ్స్​లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న నీరజ్​ చోప్రా.. ఈ మెగా పోటీలకు దూరం అయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొనడం లేదు.

  • ప్రముఖ నటుడు డేవిడ్ వార్నర్ కన్నుమూత

David Warner passed away: ప్రముఖ హాలీవుడ్​ నటుడు డేవిడ్ వార్నర్(80) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్​తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details