ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలుతెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రగతిభవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెరాస లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా.. ఉభయసభల్లో తెరాస నేతలు అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.బాసర ఘటనపై సర్వత్రా విమర్శలు.. బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఆస్వస్థతకు గురైన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలు పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.'ఇదా మీ భాష?.. ఇవన్నీ కరెక్టేనా?'.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. ఎన్‌పీఏ ప్రభుత్వ పార్లమెంటరీ భాష అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నిరసనకారులను పీఎం 'ఆందోలన్ జీవి' అని పిలవడం మంచిదా అని ప్రశ్నించారు. యూపీ ముఖ్యమంత్రి చేసిన '80-20' ఓకేనా అని అడిగారు.కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద శాంతించిన గోదారమ్మ..Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ కాస్త శాంతించింది. వర్షాలు తగ్గడం, ఎగువ నుంచి వరద తగ్గడంతో ప్రవాహ జోరు నెమ్మదించింది. ఎనిమిది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద ఉద్ధృతి కొనసాగింది. వర్షాలకు విరామం ఇవ్వడంతో ప్రవాహ జోరు క్రమంగా తగ్గుతోంది.భద్రాద్రిలో రేపు గవర్నర్ పర్యటన.. సీఎం ఏరియల్ సర్వే.. Governor And CM Bhadradri Visit : గోదారమ్మ మహోగ్ర స్వరూపంతో.. భద్రాద్రి వణికిపోతోంది. వరదలతో అతలాకుతలమవుతోన్న జిల్లాలో రేపు గవర్నర్ తమిళిసైతో పాటు సీఎం కేసీఆర్ వేర్వేరుగా పర్యటించనున్నారు. తమిళిసై.. భద్రాచలంలోని వరద బాధితులను కలుసుకోనుండగా.. సీఎం కేసీఆర్ గోదావరి ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు.21 వాహనాలు పరస్పరం ఢీ.. ఆరుగురు దుర్మరణం.. అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధూళి తుపాను కారణంగా మోంటానాలోని ఇంటర్‌స్టేట్ 90 ప్రాంతంలో 21 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి.డ్రైనేజ్ వాటర్‌తో కూరగాయల క్లీనింగ్ ఓ కూరగాయల వ్యాపారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. డ్రైనేజ్ నీటిలో కూరగాయలను కడిగి వాటిని అమ్ముతున్నాడు. ఇది తెలియని ప్రజలు అతని వద్ద కూరగాయలను కొంటున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర.. వర్ధాలోని హింగన్‌ఘాట్ మార్కెట్లో జరిగింది. ఇలా మురుగు నీటిలో కూరగాయలు కడుగుతున్న వీడియోను గుర్తుతెలియని వ్యక్తి సెల్ఫోన్లో బంధించాడు. దీనిపై మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మహిళా కానిస్టేబుల్‌పై ఇన్స్పెక్టర్ అత్యాచారంఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. నిషూ తోమర్ అనే పోలీసు ఇన్స్పెక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళా కానిస్టేబుల్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె సుల్తాన్‌పుర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ఇవి తప్పుడు ఆరోపణలని ఇన్స్పెక్టర్ చెబుతున్నారు.ఫైనల్లో పీవీ సింధు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టి.. మరో టైటిల్‌పై కన్నేసింది.లలిత్ మోదీ కూతురు.. సుస్మితా సేన్‌కు ఏ మాత్రం,,ఐపీఎల్ సృష్టికర్త లలిత్ కుమార్ మోదీ, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ డేటింగ్లో ఉన్నట్లు ఇటీవలే తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇరువురూ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీంతో నెటిజన్లు లలిత్ వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఆయన మొదటి భార్య ఎవరు? ఎంత మంది పిల్లలు అని తెలుసుకుంటున్నారు. అయితే లలిత్ కుమార్తె అలియా మోదీకి సంబంధించిన ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. వాటిని చూసేద్దాం..