ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుగురుకులాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష గురుకులాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని గురుకులాలను ఇంటర్ స్థాయికి ఉన్నతీకరించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.. ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు నమోదు..ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్, సీర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్, సీఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ, రఘురామ పీఏ శాస్త్రిలను ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు.'కౌన్ బనేగా...' పేరుతో మహిళకు రూ.39 లక్షలు కుచ్చుటోపీ సైబర్ నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా... బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. మూడు కమీషనరేట్‌ల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.'అది పెద్ద విషయమేమి కాదు'..మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. అదేమి పెద్ద విషయమేమి కాదని కొట్టిపారేసిన మంత్రి.. కూర్చొని మాట్లాడుకుంటామని తెలిపారు. కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.ఇంజినీర్ 'హైటెక్' సూసైడ్.. పాలిథీన్ బ్యాగ్‌లో నైట్రోజన్ గ్యాస్ నింపుకొని.. తలకు చుట్టుకొని చనిపోయాడు ఓ సబ్ ఇంజినీర్. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.బదిలీ చేయిస్తామని హైకోర్టు జడ్జికి బెదిరింపులు..'అవినీతి నిరోధక శాఖ.. అక్రమార్జనకు కేంద్రంగా మారింది' అని తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. బదిలీ చేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు పేర్కొన్నారు హైకోర్టు జడ్డి హెచ్‌పీ సందేశ్. 'నేను రైతు కుమారుడ్ని.. మళ్లీ వ్యవసాయం చేసుకుంటా' అని వ్యాఖ్యానించారు. జడ్జి వ్యాఖ్యల నేపథ్యంలో.. కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.మీ లొకేషన్ ట్రాక్ చేస్తున్నాయని ఆ యాప్స్‌పై డౌటా? ఇలా చేయండి! ఫోన్‌లో కొత్తగా ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేయాలంటే.. సదరు యాప్ యూజర్ నుంచి కొన్ని రకాల అనుమతులు కోరుతుంది. వాటిలో లొకేషన్, మీడియా ఫైల్స్ వంటివి తప్పనిసరిగా ఉంటాయి. ఉదాహరణకు మ్యాప్స్, ఫుడ్ డెలివరీ, రైడింగ్ యాప్స్ లొకేషన్ డేటా ఆధారంగానే యూజర్లకు సేవలందిస్తాయి. ఆ దేశం నుంచి రెండేళ్ల తర్వాత విమానాల రయ్రయ్.. భారత్‌కు నో!రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనుంది చైనా. అమెరికా సహా 125కు పైగా దేశాలతో విమాన సర్వీసులను క్రమబద్ధీకరించగా.. భారత్ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.'పీరియడ్స్ విషయంలో ఆ తప్పు చేశా.. పెళ్లయ్యాక ఏడాది నరకం!' మహిళలు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు నటి అర్చన. పెళ్లి సమయంలో పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేసేందుకు మాత్రలు తీసుకోవడం వల్ల ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డానని వెల్లడించారు. ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో భర్త జగదీశ్‌తో కలిసి పాల్గొన్నారు అర్చన.ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం- భారత్‌తో సిరీస్ సమంబర్మింగ్హామ్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్‌పై 7 వికెట్ల తేడాతో స్టోక్స్ సేన గెలిచింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416, రెండో ఇన్నింగ్స్ 245 పరుగులు చేసింది.