తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్ న్యూస్ @ 1PM - Telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

By

Published : Apr 16, 2022, 12:59 PM IST

  • చర్చిద్దాం పాలమూరుకు రండి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాలని అందులో పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

  • 'దుబాయ్‌లో నగలు అమ్ముకున్న ఇమ్రాన్‌'

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని 'పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌' (పీటీఐ) పార్టీలో తలెత్తిన తిరుగుబాటు కారణంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) ప్రధాని సర్దార్‌ అబ్దుల్‌ ఖయ్యుం నియాజి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు.. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఎన్నో ఆభరణాలను మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ అమ్ముకున్నారని, దుబాయ్​లో విక్రయించినట్లు ప్రస్తుత ప్రధానమంత్రి షెహబాజ్​ షరీఫ్​ ఆరోపించారు.

  • లవర్​తో మహిళ పరార్​!

Woman Elopes With Lover: మహారాష్ట్రలోని ఓ మహిళ తన ఆరుగురు పిల్లలను వదిలిపెట్టి ప్రియుడితో పరారైంది. అనాథలైన ఆ చిన్నారులు స్థానిక పోలీసుస్టేషన్​కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

  • 40 మంది ప్రయాణించాల్సిన బస్​లో 160 మంది.

Bus Seized: సాధారణంగా ఒక బస్​లో ఎంతమంది ప్రయాణిస్తారు? అంటే దానికి సమాధానం 40, లేదా 50 మంది అని అంటారా? ఓకే మీరు చెప్పింది కరెక్టే. కానీ ఓ బస్​లో 160 మంది ప్రయాణించారు. అంటే సాధారణం కన్నా మూడింతలు ఎక్కువ. ఇంతకీ ఈ బస్ కథేంటో తెలుసుకుందాం.

  • నదిలో చిక్కుకున్న 12 మంది.. ఒక్కసారిగా!

Boat Capsize: బోటింగ్‌కు వెళ్లిన 12 మంది నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. దావణగెరె ప్రాంతానికి చెందిన పర్యటకులు కార్వార్​ గణేశ్ గుడి ప్రాంతంలోని కాళి నదిలో రాఫ్టింగ్ చేసేందుకు వచ్చారు. బోటులో ఒకసారికి ఆరుగురు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉండగా.. 12 మంది ఎక్కారు. పరిమితికి మించి ప్రయాణికులు పడవలో ఎక్కడం వల్ల నీటి ప్రవాహంలో చిక్కుకుంది. ఇది గమనించిన నిర్వాహకులు.. మరో పడవసాయంతో శ్రమించి వారిని ఒడ్డుకు చేర్చారు.

  • కరెంట్​ 300 యూనిట్లు ఫ్రీ

Free Electricity Punjab: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది పంజాబ్​లోని ఆప్​ సర్కార్​. ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందించనున్నట్లు తాజాగా ప్రకటించింది.

  • గజరాజుల పరుగు పందెం..

అసోం రాష్ట్ర నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వారి సంప్రదాయ ఉత్సవమైన రంగాలి బిహూ(ఏప్రిల్​ 15) సందర్భంగా శివసాగర్‌ ప్రాంతంలో ఏనుగులతో పరుగు పందెం నిర్వహించారు. ముందుగా ఏనుగులకు పూజలు నిర్వహించి, పరుగు పందెంలోకి దింపారు. ఏనుగులపై మావటి కూర్చుని వాటిని పరుగులు పెట్టించారు. ఈ పందెంలో విజయం సాధించిన ఏనుగు యజమానికి నిర్వాహకులు బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. ఏనుగుల పరుగు పందెం చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

  • 'పన్ను' ఎక్కువవుతోందా?

చాలా మంది.. పన్ను ప్రణాళికను ముందుగా మొదలుపెట్టకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అలా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే పన్ను భారం తగ్గుతుంది. ఇక పన్ను మినహాయింపే కాకుండా.. సంపద సృష్టికి కూడా కొన్ని పొదుపు పథకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

  • చాహర్ ఔట్.. రూ. 14 కోట్లు చెల్లిస్తారా?

ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్​ చెన్నై జట్టుకు గట్టి షాక్ తగిలింది. లీగ్‌లోని సగం మ్యాచ్‌ల తర్వాత అందుబాటులోకి వస్తాడని భావించిన దీపక్ చాహర్.. ఐపీఎల్​ మొత్తానికి దూరమయ్యాడు. మరి అతడిని రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్​కే.. ఆ మొత్తాన్ని అతడికి చెల్లిస్తుందా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బికినీ షూట్లతో దిమాక్​ ఖరాబ్​ చేస్తోందిగా!

'క్యాలెండర్ గర్ల్'​ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన మాజీ మిస్​ ఇండియా రూహీ సింగ్​.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి బోల్డ్​ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. సోషల్​మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఓ సారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసేద్దాం...

ABOUT THE AUTHOR

...view details