తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​ న్యూస్​ @7AM - Telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-news-in-telangana
టాప్​ న్యూస్​ @7AM

By

Published : Apr 16, 2022, 7:00 AM IST

  • పోస్టుల భర్తీతోనే అందరికీ న్యాయం

దేశంలో న్యాయ వ్యవస్థ పటిష్ఠానికి కోర్టులు సామాన్యుడికి అందుబాటులో ఉండటం.. అందులో మౌలిక వసతులు ఉండటం.. ఈ రెండు విషయాలు కీలకమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఇందుకోసం తన సాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే సంతోషించేవాడిలో తానూ ఒకడినంటూ స్పష్టం చేశారు.

  • దేశానికే ఆదర్శం కావాలి

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో బెంచ్‌ల పెంపుపై ఆనందం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. అందుకు అనుగుణంగా సిబ్బంది కూడా కావాలన్నారు.

  • చైనాకు రాజ్‌నాథ్‌ గట్టి వార్నింగ్‌

చైనాకు పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు జారీచేశారు భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్​. తమకు హాని తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిబెట్టబోమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాజ్​నాథ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • ప్రయాణికులకు ఆర్టీసీ మరో వాత

ప్రయాణికులకు ఆర్టీసీ వరుస షాకులిస్తోంది. ఛార్జీలు ఇష్టారాజ్యంగా పెంచేస్తోంది. ప్రయాణికులకు ఛార్జీల పెంపును వడ్డిస్తున్న ఆర్టీసీ.. మరో భారం వేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను పెంచేసింది. గతంలో రూ.20 ఉండగా మరో రూ.10 పెంచింది.

  • పుష్కరాల్లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

pranahitha pushkaralu: ప్రాణహిత పుష్కరాల్లో భక్తజన సందడి కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తోన్న భక్తులతో నదీతీరం పరవశించింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తదితర రాష్ట్రాల నుంచి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ పౌర్ణమి కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

  • శోభాయాత్రలకు పటిష్ఠ బందోబస్తు

నేడు ఆంజనేయుడి జయంతి సందర్భంగా.. శోభాయాత్రలతో వీధులు భక్తజన సంద్రంగా మారనున్నాయి. జంట నగరాలతో పాటు జిల్లాల్లో పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా భారీగా బలగాలను మోహరిస్తున్నారు.

  • 24 నుంచి వేసవి సెలవులు

రాష్ట్రంలోని 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు నేటి నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 22తో పరీక్షలు పూర్తి కానున్నాయి. 23న ఫలితాలు.. 24 నుంచి వేసవి సెలవులు ఉండనున్నాయి.

  • కిమ్‌ జాతిరత్నాల పనే

ఉత్తర కొరియా రూ.4,500 కోట్ల విలువ గల క్రిప్టో కరెన్సీని హ్యాక్​ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ వెల్లడించింది. బ్లాక్‌చైయిన్‌ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్‌ఛేంజిల్లోకి చొరబడ్డారు ఉత్తర కొరియా హ్యాకర్లు.

  • ఆ సంస్థలో పెరిగిన 'బిగ్​బుల్'​ వాటా

Rakesh Jhunjhunwala Buys NCC: అగ్రశ్రేణి స్టాక్‌మార్కెట్‌ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా.. మౌలిక సదుపాయాల రంగ సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్‌లో మరింత పెట్టుబడి పెట్టారు. జనవరి, మార్చి నెలల మధ్యలో 44 లక్షల షేర్లను కొనుగోలు చేశారు.

  • ఓటీటీలోకి 'ఆర్​ఆర్​ఆర్'?​

పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎప్పుడెప్పుడొస్తుందా? అని కొందరు ఎదురుచూస్తుంటే, మరికొందరు ‘అతి త్వరలోనే’ అని జ్యోతిషం చెప్పేస్తున్నారు. నెట్టింట పెద్ద చర్చ సాగిస్తున్నారు. దీనిపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details