తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today : టాప్​న్యూస్​ @ 1PM - తెలుగు వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Nov 4, 2022, 1:01 PM IST

  • 'కేసీఆర్‌కు ప్రధాని కావాలనే మోజు.. అందుకే ఈ డ్రామా'

సీఎం కేసీఆర్​కు ప్రధాని కావాలనే మోజు పెరిగిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్​ చుగ్ పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంపై విపరీత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని.. కేసీఆర్‌ తన ఫామ్​హౌజ్​లో సినిమా కథ అల్లారని ఆరోపించారు.

  • 'ఫామ్​హౌజ్​ సీఎం.. పాత ముచ్చటను పదే పదే చెప్పారు'

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి, తెరాసకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదన, తీవ్ర అసహనంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత ముచ్చటను పదే పదే చెప్పారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ చూపించిన వీడియోలో ఉన్న వారితో భాజపాకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ..

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. భద్రాచలం సహా మరో మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ.. ఇంకా ఎన్నేళ్లు కాలం వెళ్లదీస్తారని ప్రభుత్వాన్ని ప్రశించింది. ఈ నెల25 లోగా భద్రాచలంతో పాటు మరో మూడు పంచాయతీలపై నిర్ణయం తీసుకోకపోతే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

  • నిజామాబాద్​లో​ దొంగల హల్​చల్​..

నిజమాబాద్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఇవి చాలవన్నట్లు కొత్తగా ప్రారంభించిన ఓ సెల్​ఫోన్​ షోరూమ్​తో పాటు మరో రెండు దుకాణాల్లోనూ దొంగతనం చేశారు. దొంగలు సృష్టించిన హల్​చల్​తో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

  • 'ప్రతిపక్ష నేతలను శత్రువులుగా చూడటం సీఎం మానుకోవాలి'

ఫోర్జరీ పత్రాల కేసులో అరెస్టై బెయిల్​పై విడుదలైన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెదేపా నేత అయ్యన్న పాత్రుడు సీఏం జగన్​పై ఘాటుగా విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను శత్రువులుగా చూడడం సీఎం మానుకోవాలని ఆయన హితవు పలికారు. తప్పుడు కేసులకు భయపడేది లేదన్న ఆయన.. ప్రభుత్వం ఎంత హింసించినా.. జగన్ అక్రమాలపై నిలదీస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

దిల్లీలో పెరుగుతున్న కాలుష్య తీవ్రత దృష్ట్యా ఆప్​ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ప్రాథమిక పాఠశాలలు మూసివేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్​ ప్రకటించారు.

  • విమానంలో రాబందు ప్రయాణం..

విమానమెక్కిన రాబందు.. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. ఓ విమానంలో ఓఖీ అనే రాబందును తమిళనాడు నుంచి రాజస్థాన్​కు తరలించారు. దాని కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

  • పోలింగ్ బూత్ మొత్తానికి ఒక్కరే ఓటర్..

ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటుతో ఫలితం తారుమారైన ఘటనలు ఎన్నో. అందుకే.. ఒకే ఒక్క ఓటరు ఉన్న చోట కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. ఆయన కోసం 8 మంది అధికారులు, భద్రతా సిబ్బందిని మారుమూల ప్రాంతానికి పంపుతోంది.

  • కోహ్లీ 'ఫేక్​ ఫీల్డింగ్'​పై బంగ్లా బోర్డు రియాక్షన్​..

బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ ఫేక్​ ఫీల్డింగ్ అంటూ సోషల్​మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. దీనిపై మాజీలు కూడా స్పందిస్తున్నారు. అయితే ఇప్పుడా విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఏం చెప్పిందంటే..

  • జాన్వీ బేబీ నీ గ్లామర్​ ట్రీట్​కు కాస్త గ్యాప్​ ఇవ్వమ్మా కుర్రాళ్లకు నిద్ర ఉండట్లే

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్​కు లిమిట్స్​ లేకుండా పోయింది. సూపర్ హాట్ ఫోటోస్​తో ఇన్​స్టా ఖాతాను నింపేస్తోంది. దీంతో నెటిజన్లు.. అబ్బబ్బ ఏం అందంరా బాబు అంటూ విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమందైతే కాస్త గ్యాప్​ ఇవ్వమ్మా అంటున్నారు. అయితే నేడు ఈ ముద్దుగుమ్మ మిలీ సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details