తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్​ 11AM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

By

Published : Sep 7, 2022, 10:59 AM IST

  • పడిపోయిన బంగారం, వెండి ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.570 మేర పడిపోయింది. ప్రస్తుతం బంగారం రూ.52,440 పలుకుతోంది. వెండి ధర సైతం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.900 పతనమై.. ప్రస్తుతం రూ.54,000 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠాన్మరణం

కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేశ్‌ విశ్వనాథకత్తి గుండెపోటుతో కన్నుమూశారు. డాలర్స్‌ కాలనీలోని తన నివాసంలో పడిపోయిన ఆయన్ను చికిత్స కోసం రామయ్య ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో ఇచ్చిన చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు.

  • మత్తు ఇస్తుండగా కార్డియాక్‌ అరెస్ట్‌.. ఎంజీఎంలో బాలుడు మృతి

Boy died while giving Anesthesia at MGM Hospital : ఓ ప్రమాదంలో చేయి విరిగిన బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చేతికి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. దానికోసం అన్ని సిద్ధం కూడా చేశారు. తీరా బాలుడికి మత్తు ఇస్తున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్‌ అటాక్ అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ విషాదకర ఘటన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

  • పరాయి మహిళలపై వ్యామోహం.. భర్తపై వేడి నూనె పోసిన భార్య

woman poured boiling oil on husband at jiyaguda : పరాయి ఆడవాళ్ల వ్యామోహంలో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని కోపోద్రిక్తురాలైన ఓ భార్య అతడిపై వేడివేడి నూనె పోసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి భార్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

  • కోలాహలంగా ఖైరతాబాద్​.. ​ లంబోదరుడి దర్శనానికై జనసందోహం

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులుతోపాటు రాజకీయ ప్రముఖుల రాకతో కోలాహలంగా మారింది. లంబోదరుణ్ని తెరాస ఎమ్మెల్సీ కవితా, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భాజపా నాయకురాలు విజయశాంతి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవసేవ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా.. భక్తులకు మహాగణపతి ఆశీస్సులు లభిస్తున్నాయి.

  • అకస్మాత్తుగా రోగికి గుండెపోటు.. సీపీఆర్​తో ప్రాణాలు కాపాడిన డాక్టర్​..

చెకప్​ కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఇది గమనించిన వైద్యుడు హుటాహుటిన అతడి వద్దకు వచ్చి సీపీఆర్​ చేసి ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

  • దేశంలో పెరిగిన కొవిడ్ కేసులు..

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,379 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • ఇది ప్రపంచ కప్​ తెచ్చే జట్టేనా?.. ఒక్కసారిగా తగ్గిన ఆశలు!

ఎప్పుడో 2007లో, టీ20 ప్రపంచకప్‌ మొదలైనపుడు ట్రోఫీ అందుకుంది భారత్‌. అప్పట్నుంచి ఇంకో కప్పు కోసం నిరీక్షణ కొనసాగుతోంది. గత ఏడాది ఘోరమైన ప్రదర్శనతో కనీసం గ్రూప్‌ దశను కూడా దాటలేకపోయింది టీమ్‌ఇండియా. ఈసారైనా తప్పులు దిద్దుకుని కప్పుకేసి దూసుకెళ్తుందనుకుంటే.. ఆసియా కప్‌లో సాధారణ ప్రదర్శనతో ఆశలు, అంచనాలను ఒక్కసారిగా తగ్గించేసింది.

  • అనిల్​రావిపూడి అంటే ఆ స్టార్​ నటికి అంత కోపమా?

'ఆలీతో సరదాగా' లో పాల్గొని నాటి సంగతులను నటి సంగీత గుర్తుచేసుకున్నారు. ఇటీవల, తాను కీలక పాత్ర పోషించిన 'మసూద' చిత్ర విశేషాలు పంచుకునేందుకు నాయకానాయికలు తిరువీర్‌, కావ్యలతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో హీరోయిన్‌ తల్లిగా నటించటం తన కెరీర్‌కు ప్లస్‌ అయిందని, మరోవైపు మైనస్‌ అయిందని సంగీత వివరించారు.

  • నటించమని అల్లు అర్జున్ రిక్వెస్ట్​.. ​

స్టార్ హీరో అల్లుఅర్జున్​ తన సినిమాలో నటించమని రిక్వెస్ట్​ చేసినా ఓ హీరోయిన్​ నో చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరు? ఎందుకు చేయనంది? తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details