తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today : టాప్​న్యూస్ @11AM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Aug 10, 2022, 11:00 AM IST

  • భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. పంద్రాగస్టున దాడికి ప్లాన్!

Jammu Kashmir IED: జమ్ము కశ్మీర్​లో భారీ ఉగ్రకుట్రను బలగాలు భగ్నం చేశాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు 30 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు, కశ్మీర్​లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్ ప్రారంభమైంది. ముగ్గురు ముష్కరులను బలగాలు చుట్టుముట్టాయి.

  • విస్తరిస్తున్న గృహ నిర్మాణరంగం..

AZADI KA AMRIT MAHOTSAV: దేశంలో గృహనిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తోంది. పట్టణ జనాభా పెరిగిపోతోంది. అయితే, పట్టణాల్లో కనీస అవసరాల కొరత.. జనాలను వేధిస్తోంది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న ప్రస్తుత సమయంలో.. మన దేశంలోని గృహ నిర్మాణ రంగం పురోగతిని, భవిష్యత్తు లక్ష్యాలను ఓసారి పరిశీలిస్తే...

  • పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

భద్రాచలం వద్ద గోదావరి భీకర రూపం దాల్చుతోంది. అర్ధరాత్రి ఒంటి గంటకు 48 అడుగులకు చేరిన నీటిమట్టం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 50.2 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక అమల్లోకి రానుంది. గోదావరిలోకి ఎగువ నుంచి 12.65 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

Nizamabad car accident : నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ వద్ద ఘోర ప్రమాదం ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... విచారణ చేస్తున్నారు.

  • హైదరాబాద్ మెట్రోకు పునర్వైభవం

Hyderabad Metro: కరోనా అనంతరం హైదరాబాద్ మెట్రో గాడిన పడుతోంది. సోమవారం అత్యధికంగా మెట్రోలో 3.94 లక్షల మంది రాకపోకలు సాగించారు. రెండేళ్ల అనంతరం ఈ స్థాయిలో ఆదరణ లభించడం ఇదే మొదటిసారి.

  • సీబీఐ, ఈడీ కాకుండా ఎంతమంది మిగిలారు: కేటీఆర్

KTR Tweets : ఎన్డీఏ నుంచి జేడీయూ నిష్క్రమించిన తర్వాత ఎంతమంది కూటమి భాగస్వాములు మిగిలారంటూ రాష్ట్ర పురపాలక,ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. సీబీఐ ఐటీ, ఈడీ కాకుండా ఎంతమంది అంటూ ట్విటర్​లో ఎద్దేవా చేశారు.

  • మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు..

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 16,047 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • ఔషధ యోగం.. ఆరోగ్య భాగ్యం..

ఆంగ్లేయుల 200 సంవత్సరాల దుర్మార్గ పాలనలో అన్ని రంగాల మాదిరే వైద్య రంగమూ వ్యాధిగ్రస్థమైంది. వరుస కరవుల కారణంగా పౌష్టికాహారలోపం వెన్నాడి లక్షల మంది చిన్నచిన్న జబ్బులకూ పిట్టల్లా రాలిపోయారు. స్వాతంత్య్రం సిద్ధించాక ఒక్కో అడుగు వేసుకుంటూ జవసత్వాలు కూడదీసుకున్నాం.

  • రవిశాస్త్రి- ద్రవిడ్​పై ధావన్​ కామెంట్స్​..

Sikhar Dhawan: టీ20ల్లో తనను ఎందుకు ఎంపిక చేయట్లేదో తెలియదు అని అన్నాడు టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​. అలాగే రవిశాస్త్రి- ద్రవిడ్​పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపాడు.

  • ఒక్క పూట తిండి దొరక్క.. దొంగచాటుగా ఫంక్షన్స్​కు వెళ్లి..

వెండితెరపై మాస్‌.. క్లాస్‌.. మాంటేజ్‌.. ఇలా డ్యాన్స్‌ థీమ్‌ ఏదైనా తనదైన స్టైల్​లో కొత్త స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు డ్యాన్స్​మాస్టర్​ శేఖర్‌ మాస్టర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్​కు సంబంధించిన పలు విషయాలు, ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, డ్యాన్స్​మాస్టర్​గా తాను ఎదిగిన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సంగతులివీ..

ABOUT THE AUTHOR

...view details