తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today: టాప్‌న్యూస్ @1PM - Today News in Telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today: టాప్‌న్యూస్ @1PM
Telangana News Today: టాప్‌న్యూస్ @1PM

By

Published : Jul 3, 2022, 1:00 PM IST

  • 'మహా' స్పీకర్​గా భాజపా నేత..

Maharastra Politics: శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం బల నిరూపణకు సిద్ధమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విధాన్​భవన్​లోని శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీల్​ చేశారు శివసేన నేతలు. మరోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​గా భాజపా నేత రాహుల్​ నర్వేకర్​ ఎన్నికయ్యారు.

  • భాజపా మీటింగ్‌లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు

హైదరాబాద్‌ నగరంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ భారీగా జరిమానాలు విధిస్తోంది. ఇప్పటి వరకూ భాజపాకు రూ.20 లక్షలకు పైగా జరిమానాలు విధించింది. ట్విటర్‌లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకొంటున్నారు. నగరంలో వెలిసిన తెరాస ఫెక్సీలకు ఫైన్లు రూ. 3 లక్షలు దాటాయి. ట్విటర్‌లో ఇంకా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు వచ్చిన ఫిర్యాదులపై రేపు జరిమానాలు విధిస్తామని జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం తెలిపారు.

  • నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..!

ఇవాళ ప్రయాణికులు.. వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. భాజపా విజయ సంకల్ప సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. '' సభకు ముందైనా మీరు మీ గమ్యస్థానాలు చేరుకోండి.. లేదంటే బహిరంగ సభ పూర్తయ్యాక ఇళ్లకు రండి'' అంటూ వాహనదారులకు సూచిస్తున్నారు.

  • అవును... ప్రధాని మోదీ సేల్స్‌మెనే..:

Bandi Sanjay Fire on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధానిని సేల్స్​మెన్ అంటావా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని.. కేసీఆర్‌ అవమానపరిచారని.. ప్రజలు క్షమించరని ఆయన ధ్వజమెత్తారు.

  • ఆ స్టేషన్లలో మెట్రో సేవలు నిలిపివేత

Hyderabad Metro Service: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నేడు భాజపా విజయ సంకల్ప సభ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతోపాటు పార్టీ ప్రముఖులు ఈ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో మ.2 గంటల నుంచి రాత్రి 10 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను పోలీసులు విధించారు.

  • ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడి హత్య

సంగారెడ్డి జిల్లా జిన్నా అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. కేపీహెచ్‌బీ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారణహత్యకు గురయ్యాడు . ప్రేమపెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నారాయణరెడ్డిని యువతి తరఫు బంధువులు చంపినట్లు అనుమానిస్తున్నారు. నారాయణరెడ్డిని హత్య చేసి నిప్పుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.

  • ఉగ్రవాదులను పట్టుకున్న కశ్మీరీలు..

జమ్ముకశ్మీర్​లో.. లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల ధైర్య సాహసాలు మెచ్చి రాష్ట్ర లెఫ్టినెంట్​ గవర్నర్​​, డీజీపీ భారీ నజరానా ప్రకటించారు.

  • రైలులో అగ్నిప్రమాదం.. ఇంజిన్​లో మంటలు

Train caught Fire Bihar: బిహార్‌లో ఓ డీఎంయూ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు రక్సౌల్‌ నుంచి నర్‌కాంతియాగంజ్‌ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. భేల్వా రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి ఇతర బోగీలకు మంటలు.. వ్యాపించకపోవటం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులందిరినీ కిందకి దింపి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

  • అండర్సన్​​పై జడ్డూ కామెంట్స్​ వైరల్​..

Ravindra Jadeja Anderson: తనను మంచి బ్యాటర్‌ అని మెచ్చుకునేలా ఇంగ్లాండ్​ ప్లేయర్​ అండర్సన్​కు ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందని అన్నాడు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర. 2014లో తామిద్దరి మధ్య జరిగిన ఓ వివాదాన్ని గుర్తుచేసుకుని ఈ విధంగా అన్నాడు.

  • నరేశ్​-పవిత్రతో తగాదా పడిన రమ్య..

గత కొన్నిరోజులుగా చిత్రసీమలో నరేశ్​, పవిత్రా లోకేష్​, రమ్య రఘుపతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడీ సమస్య మరింత ముదిరింది. ఇప్పటికే నరేశ్​-పవిత్ర జంట, రమ్య.. మీడియా ముందుకు వచ్చి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మైసూర్​లో నరేశ్​-పవిత్ర కలిసి ఉన్న హోటల్​కు వెళ్లిన రమ్య.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారితో తగాదా పడ్డారు. నిలదీసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమెను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details