ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురైల్వే స్టేషన్లలో హై అలర్ట్ Agnipath Protest:అగ్నిపథ్‌ను నిరసిస్తూ యువకులు ఆందోళనతో సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లలో హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసి వేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతిఅగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తోంది. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌లో యువకులు చేపట్టిన ఆందోళన రణరంగంలా మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రణరంగంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళన సెగ ఇవాళ హైదరాబాద్‌ను తాకింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో యువకులు ఆందోళన చేపట్టారు. మరోవైపు అగ్నిపథ్ పథకంపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర సర్కార్.. అప్పుడేమో రైతులను ఇబ్బంది పెట్టి.. ఇప్పుడు సైనికులను గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు.బాసరకు బయల్దేరిన బండి సంజయ్.. అరెస్ట్తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ... బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల చేస్తున్న ఆందోళన... నాలుగోరోజు కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీలు.. విద్యార్థుల ఆందోళనలకు మద్దతివ్వగా... ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. అయితే కామారెడ్డి పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు.విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.28.52లక్షల విలువైన 554.20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడు.. ఎయిర్‌పోర్టు వీఏఆర్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీస్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ద్వారా ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించాడు. గాజులు, గొలుసులు, బిస్కెట్ల రూపంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ సోదాలుఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ సోదరుల ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.సీఎం సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గహ్లోత్ ఇల్లు, వ్యాపార సముదాయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఓ ఫర్టిలైజర్ కుంభకోణంపై తాజాగా కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.80 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులుACB Raids: కర్ణాటకలోని పలువురు అధికారులకు శుక్రవారం తెల్లవారుజామునే దాడులు చేపట్టి షాక్ ఇచ్చింది అవినీతి నిర్మూలన విభాగం(ఏసీబీ). అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది అధికారులకు చెందిన 80 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.ఏపీ, తెలంగాణలో పెరిగిన బంగారం ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.480 పెరిగి.. రూ.52,720 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.400కుపైగా పెరిగి.. రూ.63,225గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్'అన్నాత్తే' సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల్ని పలకరించారు సూపర్‌స్టార్ రజనీకాంత్. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మిక్సడ్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే రజనీకాంత్‌కు ఉన్న ఇమేజ్, ఫాన్ ఫాలోయింగ్‌తో పాటు సినిమాపై ఉన్న అంచనాల కారణంగా ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. 'పేట','దర్బార్' చిత్రాలు కమర్షియల్‌గానూ పరాజయాలుగానే నిలిచాయి. ప్రస్తుతం ఈ హ్యాట్రిక్ ఫ్లాప్‌ల నుంచి బయటపడే ప్రయత్నంలో ఉన్నారు రజనీకాంత్.