ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుమే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. ఇప్పుడు అప్పుడు అంటూ రోజుకో తేదీ మారుస్తూ వస్తోన్న ప్రకటనలతో విద్యార్థులంతా అయోమయంలో పడుతున్నారు. వారి అనుమానాలకు చెక్ పెడుతూ ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది.పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మార్పుపదో తరగతి పరీక్షల షెడ్యూల్ మారింది. మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు వెల్లడించింది. జేఈఈ మెయిన్ షెడ్యూల్ మార్పు దృష్ట్యా పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చారు.మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరి మృతి గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. బహుళ అంతస్తుల భవనం కోసం 40 అడుగుల మేర పునాదులు తవ్వుతుండగా.. మట్టిపెళ్లలు విరిగిపడి వాటికింద కూలీలు చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. మట్టిపెళ్లల కింద చిక్కుకున్న మరో కూలీని తోటికూలీలు కాపాడారు. మట్టిపెళ్లలు విరిగిపడుతుండటం గమనించిన ఇద్దరు కూలీలు అప్రమత్తమై అక్కడినుంచి తప్పుకున్నారు. బాధితులంతా ఉపాధి కోసం బిహార్ నుంచి వలస వచ్చారు.12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్దేశంలో 12-14 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ప్రికాషన్ డోసు పంపిణీ సైతం ప్రారంభించారు. 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ కార్బెవ్యాక్స్ టీకా మాత్రమే ఇవ్వాలి.సుప్రీం కోర్టు ముంగిట 'హిజాబ్ వివాదం' hijab ban supreme court: హిజాబ్ వివాదంలో కర్ణాటక హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్లను హోలీ సెలవుల తర్వాత పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు, ఒకే ర్యాంకు ఒకే పింఛన్ విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్లు తీసుకురావాలిహైదరాబాద్లో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 10 వేల కోట్ల నిధులు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ అభివృద్ధికి భాజపా నేతలు తమతో పాటు పోటీ పడాలని చురకలంటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్.. 2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఇప్పటికే ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు.ఎయిర్‌గన్ పేలి బాలిక మృతిసంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రసాద్ ఫాంహౌస్‌లో ఎయిర్‌గన్ పేలి ఒక బాలిక మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.భారత్- రష్యా చమురు ఒప్పందం.. India Russia Oil Deal: రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంతో భారత్ చరిత్రలో తప్పుడు వైపు ఉండొచ్చని హెచ్చరించింది.వరల్డ్‌కప్‌లో భారత్‌కు రెండో ఓటమిWorldcup 2022: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మరో పరాజయాన్ని చవిచూసింది. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. భారత బౌలర్ జులన్ గోస్వామి 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.'గాడ్‌ఫాదర్' సెట్లో సల్మాన్ ఖాన్ Godfather Movie Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్' చిత్రంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఈమేరకు సల్మాన్ చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై చిరు ట్వీట్ చేశారు. సల్మాన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్.