ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ టీకా పంపిణీ బుధవారం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపింది. మరి ఏ టీకా వేస్తున్నారు? రిజిస్ట్రేషన్ ఎలా? వంటి వివరాలు మీకోసం.మేలో ఇంటర్మీడియట్ పరీక్షలు?Telangana Inter Exams: జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పు చేసి, ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించనుండడంతో ఏప్రిల్ 22వ తేదీ నుంచి మొదలుకావాల్సిన ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పు అనివార్యమవుతోంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త తేదీలను ప్రకటించనున్నారు.పరిమితికి మించి అప్పులు.. సభ ఆమోదం లేకుండానే CAG Report: రాష్ట్రంలో శాసనసభ ఆమోదం లేకున్నా భారీమొత్తంలో వ్యయం జరుగుతోందని కాగ్ పేర్కొంది. పద్దుల నిర్వహణపై కచ్చితత్వం లేదని అభిప్రాయపడింది. అప్పులు పరిమితికి మించి పెరిగిపోతున్నాయని వెల్లడించింది. ప్రభుత్వం పారదర్శక బడ్జెట్ విధానాలు అనుసరించాలని కాగ్ సూచించింది.నష్టాల్లో 16 ప్రభుత్వ రంగ సంస్థలు: కాగ్రాష్ట్రంలో ఆర్థిక పనితీరు విశ్లేషించిన కాగ్... 30 ప్రభుత్వ రంగ సంస్థల్లో గడచిన ఆర్థిక సంవత్సరంలో 12 సంస్థలు లాభాలను ఆర్జించాయని పేర్కొంది. 16 నష్టాల బారినపడినట్లు వివరించింది. 2021 మార్చి నాటికి 30 సంస్థల్లో నికర నష్టాలు దాదాపుగా రూ. 60 వేల కోట్లు ఉన్నట్లు కాగ్ తేల్చింది.పుతిన్‌కు ఎలాన్ మస్క్ మరో ఛాలెంజ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మరో సవాలు విసిరారు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. పుతిన్ గాని తనతో తలపడ దలుచుకుంటే ఆయనకు ఉన్న సొంత ఎలుగుబంటిని తెచ్చుకోవచ్చని చెప్పారు. ఇందుకు రష్యా కూడా గట్టిగానే స్పందించింది.22.68 లక్షల ఎకరాలు అనుకుంటే.నిధుల వ్యయంలో ముందున్నా.. అనుకున్నంత ఆయకట్టు సాధించడంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. 2021-22 సంవత్సరంలో 22.68 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.మరో 20 అడుగుల ఎత్తు పెరిగిన ఐఫిల్ టవర్! Eiffel Tower Height: ప్రపంచంలోని ముఖ్యమైన పర్యటక కేంద్రాల్లో ఒకటైన ఐఫిల్ టవర్ ఎత్తు పెరిగింది. అవును నిజమే.. ఇప్పటికే 1,063 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఐఫిల్ టవర్ ఇప్పుడు సుమారు మరో 20 అడుగులు పెరిగింది.వాహన పీఎల్‌ఐ పథకంలోకి బడా కంపెనీలుమారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ సహా 75 సంస్థలకు పీఎల్‌ఐ పథకం కింద ప్రోత్సాహకాలు అందనున్నాయి. పీఎల్‌ఐ పథకం కింద ఐదేళ్లలో రూ.42,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే, రూ.74,850 కోట్ల ప్రతిపాదనకు వచ్చాయని కేంద్రం వెల్లడించింది.టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిచి ఊపుమీదున్న టీమ్ఇండియా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై విజయం సాధించి గత ప్రపంచకప్ ఫైనల్ పోరులో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది.కుర్రకారుపై అలెగ్జాండ్రా దండయాత్ర!అమెరికా నటి అలెగ్జాండ్రా దదారియో పుట్టినరోజు నేడు (మార్చి 16). ఈ సందర్భంగా ఆమె విశేషాలను తెలుసుకోండి.' పెర్సీ జాన్సాన్' సిరీస్‌లో ఆనాబెత్ ఛేస్ పాత్రతో బాగా గుర్తింపు పొందింది