ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుహిజాబ్ బ్యాన్‌కు హైకోర్టు సమర్థన విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతాచారం ప్రకారం.. తప్పనిసరేం కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ కొట్టివేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. దక్షిణ కన్నడ జిల్లాలో విద్యాసంస్థలను మూసివేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.వారసత్వ రాజకీయాలకు భాజపా వ్యతిరేకంభాజపా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. అందుకే పార్టీ నేతల పిల్లలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించలేదన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబ రాజకీయాలు శ్రేయస్కరం కాదన్నారు.'పెద్ద పొరపాటు జరిగింది.. కానీ ...' India missile hit Pakistan: పాక్ భూభాగంలోకి దూసుకెళ్లిన క్షిపణి ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.బిల్లును సభలో ప్రవేశపెట్టిన సీఎం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. సభకు హాజరైన సీఎం కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఈ బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతోంది. మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ చర్చను ప్రారంభించారు.రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదు 2019-20 సంవత్సరంలో ఐదేళ్లలో మొదటిసారిగా రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదని కాగ్ అభిప్రాయపడింది. ఆ ఏడాదిలో తీసుకున్న రుణాల్లో 75 శాతానికి పైగా అప్పుల చెల్లింపుల కోసం వినియోగించారని తెలిపింది. 2020 మార్చ్ 31తో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ నివేదిక సమర్పించింది.శాసనసభ సాక్షిగా నేతలను అవమానించారు'శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ నేతలను అవమానించారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. పదేపదే తమ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని కాంట్రాక్టర్ అంటూ వెక్కిరించినట్లుగా మాట్లాడటం అధికార పార్టీ నేతలకు సమంజసం కాదని హితవు పలికారు.పిల్లాడి ఆట.. తల్లి మృతి, జైలుకు తండ్రి Boy Shot Mother: తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున తల్లిని కాల్చాడు మూడేళ్ల బాలుడు. అమెరికాలోని షికాగోలో జరిగిన ఈ ఘటనలో ఆ బాలుడి తండ్రిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.మాస్క్ ధరించినా స్క్రీన్ అన్లాక్కరోనా వేళ ఐఫోన్ యూజర్ల కోసం అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్. ఫేస్ మాస్క్ ధరించినా ఫేస్ ఐడీ స్కాన్ సాయంతో స్క్రీన్ అన్‌లాక్ అయ్యేలా సరికొత్త అప్డేట్ను విడుదల చేసింది. మరి ఈ ఫీచర్‌ను ఎలా సెట్ చేయాలో చూద్దాం..ఐపీఎల్ నిబంధనల్లో కీలక మార్పులు! Major rule Changes in Ipl 2022: మరి కొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్ నిబంధనల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశముందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.ఆలియా 'బ్రహ్మస్త్ర' గ్లింప్స్అందం, చలాకీతనం, నటనతో యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నటి ఆలియాభట్. త్వరలోనే 'ఆర్ఆర్ఆర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భామ.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 'బ్రహ్మస్త్ర' సినిమాలోని తన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆమె పాత్ర పేరు ఇషాగా పరిచయం చేసింది.