ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలువనదేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు ములుగు జిల్లా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాది మంది ప్రజలు వనదేవతల దర్శనానికి బారులు తీరుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రేణుసింగ్ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.హార్వర్డ్ సెమినార్‌కు కేటీఆర్ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20 న జరగబోయే 'ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్' సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనను కోరింది. ఈ మేరకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత నిన్న తిరుమలకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ ఉదయం మళ్లీ కుటుంబ సభ్యులతో కలిసి మరోమారు దర్శించుకున్నారు.చంద్రబాబు కుటుంబ సభ్యుల భూమి కబ్జా..!ఏపీలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి కబ్జాకు కొందరు యత్నించారు. సర్వే నంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు వచ్చారు. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పేరున ఉన్న స్థలంలో రాతి కూసాలు ఏర్పాటు చేస్తున్నారు.ఆ కేసులో 38మందికి మరణశిక్ష 2008 ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు 38 మందికి మరణ శిక్ష విధించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణ శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు 11 మందికి జీవిత ఖైదు విధించింది. పేలుళ్ల కేసుకు సంబంధించి మొత్తం 77 మంది నిందితులపై విచారణ జరిపిన న్యాయస్థానం 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 8 నెలల గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతిఓ మహిళ తన 8 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక అనుమతులిచ్చింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున అనుమతులు కావాలని ఆ మహిళ కోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం అనుమతులిచ్చింది.బ్రెజిల్‌లో వరద బీభత్సం.. బ్రెజిల్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలకు కొండ చరియలు విరిగి పడి మరణించిన వారి సంఖ్య 117కు పెరిగింది. బురదలో కూరుకుపోయిన మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది.మళ్లీ పెరిగిన బంగారం ధరదేశంలో పుత్తడి ధర మరోసారి పెరిగింది. పది గ్రాముల మేలిమి బంగారం ధర క్రితం రోజుతో పోల్చితే సుమారు రూ. 353 పెరిగింది. కిలో వెండి ధర రూ. 65,877 వద్ద ఉంది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర ఇలా ఉంది.'కోహ్లీ ఇలాంటి రిస్క్ ఎప్పుడూ తీసుకోలేదు' టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆటతీరుపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ ఆటతీరుతో జట్టు కాస్త ఇబ్బంది పడుతోందని అభిప్రాయపడ్డాడు.భీమ్లానాయక్ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనా?పవన్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ నుంచి టీజర్ లేకుండా ఒకేసారి ట్రైలర్‌నే విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ ఇదివరకే ప్రకటించారు. దీంతో అది ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.