తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

By

Published : Jul 16, 2022, 7:00 PM IST

  • భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదారమ్మ క్రమంగా శాంతిస్తోంది. శుక్రవారం సాయంత్రం 70.10 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. ప్రస్తుతం 69.4గా ఉంది. సుమారు 200 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

  • అఖిలపక్ష నేతలతో ఓంబిర్లా భేటీ..

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో సభా మర్యాదలు కాపాడాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కోరారు. సోమవారం నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. మరోవైపు, అగ్నిపథ్ పథకంపై సభలో చర్చ జరపాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది.

  • 'జైళ్లలో 80శాతం మంది వారే.. దృష్టిపెట్టాలి'

దేశంలోని ఖైదీలలో ఎక్కువ మంది విచారణ ఎదుర్కొంటున్నవారే ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ. విచారణ ఈ ప్రక్రియ ఎందుకు ఇంత ఆలస్యంగా జరుగుతోందనే విషయంపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. మరోవైపు, కోర్టుల్లో వాదనల కోసం స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పిలుపునిచ్చారు.

  • పథకం ప్రకారమే వ్యాపారి ఇంట్లో చోరీ..

వివేకానందనగర్‌లో ఈ నెల 13న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నేపాలీ ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

  • ఆ గ్రామాల్లో ఎటు చూసినా నీరే..

ఒడిశాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మల్కాన్​గిరి జల్లాలోని ముంపు గ్రామాలు.. వరద వలయంలో చిక్కుకున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్​ సింగ్​ తెలిపారు.

  • మరో రెండు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.

  • 'ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరం'

PM Modi in UP: ఉచిత పథకాల హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌నూ నిర్మిస్తోందని ఉద్ఘాటించారు. యూపీలో నిర్మించిన బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వేను ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్​తో కలిసి ప్రారంభించారు.

  • ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

mla seethakka: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా సీతక్క ప్రయాణిస్తున్న పడవలో పెట్రోల్​ అయిపోయింది. దీంతో పడవ వాగు మధ్యలో ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. అనంతరం వాగు ఉద్ధృతికి ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

  • మరో 6 నెలల్లో పూర్తిగా చస్తుంది

ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరంలో భారీ అవినీతికి పాల్పడ్డారని రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం దోపీడికి పాల్పడిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • రవితేజను కారవాన్​లోకి లాగిన చిరంజీవి​..

chiru 154 movie: చిరు-బాబీ కాంబినేషన్​లో తీస్తున్న కొత్త సినిమా 'మెగా154' షూటింగ్​లో ఆసక్తికర పరిణామం జరిగింది. శనివారం షూటింగ్​లో మాస్​హీరో రవితేజ జాయిన్ అయ్యారు. రవితేజ వచ్చిన వెంటనే.. తన కారవాన్​లోకి లాగేశారు మెగాస్టార్​.

ABOUT THE AUTHOR

...view details