భారత్ బంద్
జీఎస్టీ నిబంధనలను సమీక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ). ఈ నేపథ్యంలో నేడు దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని సీఏఐటీ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
భక్తుల రద్దీ
గిరిజన ఆరాధ్యదైవం మేడారం సమ్మక్క, సారమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున్నారు. రెండో రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మాటల యుద్ధం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. లక్ష 32 వేలకు పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశామన్న అధికార తెరాస ప్రకటనను విపక్షాలు ఖండించగా.. తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని అధికార పక్షం ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
వంద మందికి పైగా గల్లంతు..!
ఉన్న ఊరిలో ఉపాధి కరవై.. కాయకష్టం చేసి నాలుగు రాళ్లు సంపాదిద్దామని ఏటా ఎంతోమంది కోటి ఆశలతో ఎడారి దేశాలకు వెళ్తున్నారు. తల తాకట్టు పెట్టి అప్పులు చేసి.. ఏజెంట్లను ఆశ్రయించి గల్ఫ్‌కు పయనమవుతున్నారు. అక్కడికి వెళ్లిన కొత్తలో అంతా బాగుందని కుటుంబ సభ్యులతో చెప్పినా.. ఆ తర్వాత కొన్నాళ్లకే వారి నుంచి క్షేమ సమాచారం అందడం లేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
తేలేది ఇవాళే..
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బరిలో నిలిచేదెవరో నేడు తేలనుంది. ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరిరోజు.. ఎంత మంది బరిలో ఉంటారో ఇవాళ తేలిపోతుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.